
అయితే వార్2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం ఈసారి తారక్ డబుల్ కాలర్ ఎగరేశారు. ఏమీ పరవాలేదని ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా బొమ్మ అదిరిపోయిందని తారక్ అన్నారు. అభిమానులు పండగ చేసుకోవాలంటూ తారక్ పేర్కొన్నారు. కూలీ సినిమాతో పోల్చి చూస్తే వార్2 సినిమా రేసులో కొంతమేర వెనుకబడిందనే సంగతి తెలిసిందే. అయితే తారక్ మాత్రం వార్2 లో గట్టి కథ, అద్భుతమైన కథనం ఉందని చెప్పకనే చెప్పేశారు.
సినిమాలో ఆసక్తికర ట్విస్టులు ఉంటాయని దయచేసి ఆ ట్విస్టులను మాత్రం రివీల్ చేయొద్దని తారక్ కోరారు. అభిమానులకు గట్టి హోప్ ఇచ్చే విషయంలో తారక్ నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వార్2 సినిమా ఓపెనింగ్స్ ఎలా ఉన్నా ఈ సినిమాకు హిట్ టాక్ రావడం పక్కా అని తారక్ కామెంట్ల ద్వారా అర్థమవుతోంది. బుకింగ్స్ మొదలైతే ఈ సినిమా రేంజ్ ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.
వార్2 సినిమా రికార్డులు క్రియేట్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు ఏకంగా 80 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది. 2025 వార్2 నామ సంవత్సరం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఈ సినిమా ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. నాగవంశీ నమ్మకాన్ని ఈ సినిమా ఎంతమేర నిజం చేస్తుందో చూడాలి.