
హృతిక్ రోషన్ - జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో నటించారు. కీయరా అద్వానీ హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ పాత్రలో కనిపించబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ అటు టాలీవుడ్ ఇటు కోలీవుడ్ మధ్యలో బాలీవుడ్ కోడై కూసింది. తార్క్ ని నెగిటివ్ గా చూపించడం ఏంటి..? ఈ సినిమా దొబ్బేస్తుంది.. తెలుగు ఆడియన్స్ అసలు ఒప్పుకోరు అంటూ రకరకాల కామెంట్స్ కూడా వినిపించాయి. ఫైనల్లీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ నటించిన వార్ 2 సినిమా థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి రెడీ అయ్యింది.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలు ఇస్తూ వార్ 2 మూవీ టీం బిజీ అయిపోయింది . నిన్న హైదరాబాదులో నిర్వహించిన ప్రీ ర్లీజ్ ఈవెంట్ కూడా సక్సెస్ అయ్యింది. అయితే ఈవెంట్ స్టేజిపై హృతిక్ రోషన్ - జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన మాటలు బట్టి చూస్తే అసలు వార్ 2 సినిమాలో ఎవరు హీరో కాదు, ఎవరు విలన్ కాదు.. ఈ సినిమా ఒక సరికొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కింది. పూర్తిగా ఊహకందని విధంగానే ఈ ప్రాజెక్టు ఉండబోతుంది అంటూ తెలిసిపోయింది .
డైరెక్టర్ కి బాగా తెలుసు ఒక హీరోని హీరోగా చూపించి మరొక హీరోని విలన్ గా చూపిస్తే ఇంకో హీరో ఫ్యాన్స్ అసలు ఒప్పుకోరు . ఆ కారణంగానే ఫస్ట్ హాఫ్ లో హృతిక్ రోషన్ ని హీరోగా చూపించి జూనియర్ ఎన్టీఆర్ ని విలన్ గా చూపించారట . సెకండ్ హాఫ్ లో ఎన్టీఆర్ ని హీరో చేసి హృతిక్ రోషన్ ని విలన్ గా చూపించారట . సినిమా రిలీజ్ అయ్యాక డైరెక్టర్ టాలెంట్ ఏంటో తెలిసిపోతుంది అంటున్నారు బాలీవుడ్ జనాలు. చూడాలి మరి అయాన్ ముఖర్జీ ఈ విషయంలో ఎంతవరకు సక్సెస్ అవుతాడు అనేది..!?