టాలీవుడ్ హీరో రవితేజ, శ్రీలీల కాంబినేషన్లో వస్తున్న రెండో చిత్రం మాస్ జాతర.. డైరెక్టర్ భాను భోగవరపు డైరెక్షన్లో వస్తున్న చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన నాగ వంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 27 న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేసిన చిత్ర బృందం వరుస అప్డేట్లను ఇస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా తాజాగా చిత్ర బృందం టీజర్ ని కూడా రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ లభించినట్లు కనిపిస్తోంది.


టీజర్ విషయానికి వస్తే.. ఎంట్రీ తోనే రవితేజ వైల్డ్ ఎంట్రీగా ఇచ్చినట్లు కనిపిస్తోంది. వీడు ఒక కాలేజీ స్టూడెంట్ ని చంపేశారు అనే డైలాగ్ తో మొదలవుతుంది. ఇక తర్వాత రవితేజ ఎంట్రీ కూడా హైలెట్గా కనిపిస్తోంది. ఇందులో రవితేజ రైల్వే పోలీసుగా కనిపించబోతున్నారు. మాస్ జాతర అనే టైటిల్ కి తగ్గట్టుగా  వైలెన్స్ చాలా ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. అలాగే రవితేజ, శ్రీ లీల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయేలా ఉన్నాయి.


ఇందులో రాజేంద్రప్రసాద్ కామెడీ కూడా హైలెట్ గా ఉన్నది. అలాగే చమ్మక్ చంద్ర ,రవితేజ మధ్య వచ్చే ట్రైన్  కామెడీ సన్నివేశాలు కడుపుబ్బ నవ్వించేలా ఉన్నాయి. ఫైట్స్ సన్నివేశాలు కూడా అభిమానులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. చివరిలో రాజేంద్రప్రసాద్ చెప్పే డైలాగు టీజర్ కి హైలైట్ గా ఉన్నది. మరి టీజర్ చూస్తూ ఉంటే కచ్చితంగా రవితేజ మాస్ జాతర సినిమాతో ఈసారి సక్సెస్ కొట్టేలా కనిపిస్తోందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న హీరోయిన్ శ్రీలిల సరైన సక్సెస్ అందుకోలేక సతమతమవుతోంది. మరి మాస్ జాతర సినిమాతో అటు రవితేజ ఇటు శ్రీలీల అభిమానులు ఇద్దరు కూడా ఈసారి సక్సెస్ అందుకుంటారని అభిమానులు ధీమాని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: