
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ సినిమాను ముందుగా అందరూ రంగస్థలం 2 అని అనుకున్నారు. కానీ మేకర్స్ నుంచి వేరే రకమైన హింట్స్ వస్తూనే ఉన్నాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఇది నిజంగానే రంగస్థలం 2 కావచ్చని తెలుస్తోంది. సుకుమార్ ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తిచేసి హీరోయిన్స్‌తో పాటు నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నారని సమాచారం. ఈ సినిమాలో కూడా రంగస్థలం లాంటి నేచురల్ లుక్, ఫీల్ చూపించేందుకు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం, రంగస్థలం 2 కాకుండా కొత్త కాన్సెప్ట్ ఉంటే బాగుంటుందని సలహా ఇచ్చారట. కానీ సుకుమార్, రామ్ చరణ్ ఇద్దరూ ఆ సజెషన్ పట్టించుకోకుండా రంగస్థలం 2కే ఓకే చెప్పారని తెలుస్తోంది. ఈ సినిమా హిట్ అవుతుందా లేదా అనేది ఇప్పటికి అనుమానాస్పదంగానే ఉంది. ఎందుకంటే రామ్ చరణ్ ఇప్పటికే రంగస్థలంలో తన టాలెంట్ ప్రూవ్ చేశాడు. అదే స్టోరీని సీక్వెల్‌గా తీస్తే హిట్ అవుతుందో, ఫ్లాప్ అవుతుందో చెప్పలేం. చిరంజీవి, సుకుమార్ టాలెంట్‌కి కొత్త కాన్సెప్ట్ రాబట్టమని చెప్పినా, సుకుమార్ తిరస్కరించడంతో రామ్ చరణ్ తన కెరీర్‌పై రిస్క్ తీసుకుంటున్నాడని భావిస్తున్నారు.
ఇప్పటికే "పెద్ది" సినిమాలో నేచురల్ లుక్‌లో కనిపించబోతున్న రామ్ చరణ్.. మళ్లీ రంగస్థలం 2లో అదే లుక్‌లో వస్తే ప్రేక్షకులు లైక్ చేస్తారా..? ఎంకరేజ్ చేస్తారా..? లేక గేమ్‌చేంజర్‌లా ఫ్లాప్ అవుతుందా..? అన్న సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి. వీటన్నింటినీ ఆలోచించి రామ్ చరణ్ సరైన నిర్ణయం తీసుకుంటే మంచిదని అభిమానులు అంటున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో...??