
అయితే వారు చెప్పిన రిలీజ్ డేట్ దగ్గరపడుతూనే, "వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ఇంకా పూర్తి కాలేదు" అంటూ సినిమా మళ్లీ వాయిదా పడుతోంది. ఇప్పటికే ఇలాంటివి చాలాసార్లు జరిగాయి. ఇప్పుడు రిలీజ్ డేట్ విషయంలో కొత్త న్యూస్ హైలైట్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. దీపావళి సీజన్‌లో రిలీజ్ చేస్తే మంచి రన్ వస్తుందని, మంచి కలెక్షన్స్ కొనసాగుతాయని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే, ఇందులోని కంటెంట్ ప్రేక్షకులను ఖచ్చితంగా మెప్పిస్తుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి..ఈ సారి చెప్పిన రిలీజ్ డేట్‌నే కన్ఫామ్ చేసి సినిమా రిలీజ్ చేస్తారా? లేక మళ్లీ ఏదో కొత్త కారణం చెప్పి వాయిదా వేస్తారా? అన్న టెన్షన్ ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైంది.
కాగా ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటించింది. ఈ సినిమాలో ఆమె చాలా ఢిఫరెంట్ పాత్రలో కనిపించబోతుందట. ఈ సినిమాలో మరో మెగా హీరో కూడా ఉన్నాడని ఆ హీరో రోల్ చాలా సర్ప్రైజ్ గా ఉండబోతుందట. ఇది ధియేటర్ లో స్క్రీన్ పై చూసే ఆ రోల్ గురించి తెలుసుకోవాలట. అలా ప్లాన్ చేశాడు వశిష్ట అంటూ తెలుస్తుంది. ఈ సినిమా క్లైమ్యాక్స్ అసలు హైలెట్ మూవీ కి అంటూ తెలుస్తుంది..!!