
అయితే మెగాస్టార్ పుట్టినరోజు కానుకగా చిరంజీవి బాబీ కాంబో మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ కాగా గొడ్డలి, రక్తపుధారతో ఉన్న పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. బాబీ ఈసారి అంతకు మించి అనేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ బ్యానర్ కు సైతం ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకం కానుంది.
డాకు మహారాజ్ సినిమా సక్సెస్ సాధించినా బాక్సాఫీస్ వద్ద ఒక స్థాయిని మించి ఈ సినిమా సంచలనాలు సృష్టించలేదనే సంగతి తెలిసిందే. బాబీ సైతం ప్రస్తుతం కెరీర్ పరంగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దర్శకుడు బాబీ తర్వాత సినిమాలతో ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది. ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
వరుసగా సినిమాలను ప్లాన్ చేసుకుంటున్న చిరంజీవి ఈ సినిమాలతో ఏ స్థాయిలో మెప్పిస్తారనే ప్రశ్నలు సైతం వ్యక్తమవుతున్నాయి. చిరంజీవి పారితోషికం 70 నుంచి 80 కోట్ల రూపాయల స్థాయిలో ఉండగా ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోవడం సులువైన విషయం కాదు. సీనియర్ హీరోలలో చిరంజీవి వేరే లెవెల్ అని చెప్పవచ్చు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు