తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ కలిగిన హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు. ఈయన హీరోగా కెరియర్ను ప్రారంభించిన తర్వాత మంచి విజయాలను చాలా తక్కువ సమయంలో అందుకున్నాడు. దానితో ఈయన క్రేజ్ చాలా తక్కువ సమయంలో భారీ ఎత్తున పెరిగింది. ఈ మధ్య కాలంలో మాత్రం ఈయన వరుస పెట్టి భారీ అపజయాలను అందుకుంటూ వస్తున్నాడు. కానీ ఈయన నటించిన సినిమాలపై ప్రేక్షకులు మాత్రం మంచి అంచనాలు పెట్టుకుంటున్నారు. కానీ ఈయన మాత్రం వరుస పెట్టి అపజయాలను అందుకుంటున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ , గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన కింగ్డమ్ అనే సినిమాలో హీరోగా నటించాడు.

భాగ్య శ్రీ బోర్స్ ఈ మూవీ లో హీరోయిన్గా నటించింది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవార నాగ వంశీ నిర్మించిన ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని జూలై 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు బాక్సా ఫీస్ దగ్గర విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే మిక్స్ డ్ టాక్ వచ్చింది. ఈ సినిమా భారీ కలెక్షన్లను వసూలు చేయడంలో విఫలం అయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని సొంతం చేసుకుంది. 

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలబడింది. ఈ మూవీ ని  ఆగస్టు 27 వ తేదీ నుండి తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో తమ ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్  సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను భారీ ఎత్తున ఆకట్టుకోవడంలో విఫలమైన ఈ సినిమా ఓ టీ టీ ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd