పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక సినిమాకు కమిట్ అయిన తర్వాత ఆ సినిమాను పూర్తి చేసే విషయంలో చాలా చిత్త శుద్ధిని చూపిస్తూ ఉంటాడు. సినిమా పూర్తి అయిన తర్వాత ప్రమోషన్లలో పాల్గొనడానికి మాత్రం పెద్దగా ఆసక్తి చూపాడు. మొదటి నుండి కూడా పవన్ కళ్యాణ్ సినిమా ఈవెంట్లలో పాల్గొనడానికి చాలా దూరంగా ఉంటూ వస్తాడు. సినిమాకు సంబంధించిన ఏదో ఒక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లాంటి దాంట్లో పాల్గొని ఆ సినిమా గురించి చెబుతూ ఉంటాడు. ఆ తర్వాత సినిమా సక్సెస్ అయినా కూడా దాని గురించి బయటకు వచ్చి గొప్పగా చెప్పాడు. ఇకపోతే తాజాగా పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే.

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" సినిమా విషయంలో మాత్రం తన రూటు మొత్తాన్ని మార్చేశాడు. హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను పెద్ద ఎత్తున నిర్వహించాడు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడిన ఈ మూవీ పై పెద్ద స్థాయిలో అంచనాలు ప్రేక్షకులు ఏర్పడలేదు. ఎప్పుడైతే పవన్ బయటకు వచ్చి ఈ సినిమా గురించి గొప్పగా చెప్పాడో అప్పటి నుండి ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయింది. ఇక ప్రస్తుతం పవన్ "ఓజి" అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.

మూవీ ని సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ అంచనాలు పెంచేందుకు పవన్ మరో స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. పవన్ "హరిహర వీరమల్లు" సినిమా మాదిరి ఈ మూవీ ని కూడా పెద్ద ఎత్తున ప్రమోషన్ చేయబోతున్నట్లు , దాని కోసం ఈ మూవీ విడుదలకు ఒక వారం ముందు పెద్ద ఎత్తున ఈ సినిమా ప్రమోషన్లకు సమయాన్ని కేటాయించనున్నట్లు తెలుస్తోంది. అదే గాని జరిగితే ఈ సినిమాపై అంచనాలు తారా స్థాయికి చేరడం ఖాయం అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: