నందమూరి బాలకృష్ణ అంటే కేవలం మామూలు సినీ ప్రేక్షకులకే కాదు సినీ ఇండస్ట్రీలో ఉండే చాలామందికి కూడా ఇష్టం.. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సంబరం ఉంటుంది అని అంటూ ఉంటారు. అయితే అప్పుడప్పుడు ఏదో అభిమానులపై కోపం ప్రదర్శిస్తారు తప్ప ఆయనకు అభిమానులపై ఎలాంటి కోపం ఉండదు. ఆయన ప్రేమతోనే అలా చేస్తారు. ఇక బాలకృష్ణ పబ్లిక్ లోకి వచ్చినప్పుడు కోపంతో అభిమానులపై చేయి చేసుకోవడం అభిమానులకు కూడా ఇష్టమే. నందమూరి హీరో అంటే ఆమాత్రం ఉండకపోతే ఎలా.. మా అభిమాన హీరో మమ్మల్ని తాకితే అంతకన్నా అదృష్టం మరొకటి ఉంటుందా అని వాళ్ళు సంబరపడిపోతుంటారు. అయితే అలాంటి బాలకృష్ణ తాజాగా ఇండస్ట్రీలోకి వచ్చి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా అరుదైన అవార్డు అందుకున్న సంగతి మనకు తెలిసిందే. 

లండన్ కి చెందిన వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో బాలకృష్ణ చోటు సంపాదించారు.అయితే ఈ సంస్థ వాళ్ళు స్వయంగా బాలకృష్ణ కోసం ఓ ఈవెంట్ పెట్టి సర్టిఫికెట్ ని అందజేశారు. ఇక దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో చాలామంది సెలబ్రిటీలు బాలకృష్ణని పొగడమే కాకుండా ఆయన గొప్పతనం గురించి కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రజినీకాంత్ బాలకృష్ణ గొప్పతనం ఎలాంటిదో బయటపెట్టారు.. బాలకృష్ణ గురించి రజినీకాంత్ మాట్లాడుతూ.. ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు.. కత్తితో కాదురా కంటి చూపుతో చంపేస్తా..ఈ డైలాగులు నేను చెబితే బాగుండవు.. బాలకృష్ణ కే సెట్ అవుతాయి. బాలకృష్ణ ఎక్కడ ఉంటే అక్కడ పాజిటివిటీ ఉంటుంది.. ఆయన ఉన్నచోట నెగిటివిటీ అస్సలు ఉండదు.ఇండస్ట్రీలో బాలకృష్ణకు ఎవరు సాటిరారు..ఆయనకు ఆయనే పోటీ.

బాలకృష్ణ సినిమా థియేటర్లో విడుదలై హిట్ అయింది అంటే కేవలం బాలయ్య అభిమానులకే కాదు ఇతర హీరోల అభిమానులు కూడా సంబరపడిపోతారు అంటే ఆయన గొప్పతనం ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆయన స్ట్రెంత్ కూడా అదే... బాలకృష్ణ ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషం..ముందుగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే బాలకృష్ణ ఇలాంటి అవార్డులు మరెన్నో అందుకొని సినిమా ఇండస్ట్రీలో 75 సంవత్సరాలు సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.లవ్ యూ బాలయ్య అంటూ బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని తెలిపేలా ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు రజినీకాంత్.. ప్రస్తుతం రజినీకాంత్ పెట్టిన ఈ పోస్ట్ ని బాలకృష్ణ అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: