నాచురల్ స్టార్ నాని తన సినీ కెరీర్ ని ఎంతో బాగా బిల్డ్ చేసుకుంటున్నారు. ఇండస్ట్రీలోకి దర్శకుడు అవుదామని వచ్చిన ఈయన ప్రస్తుతం హీరోగా..పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే అలాంటి నాని కెరియర్ ని ఒక రిసెప్షనిస్ట్ మార్చేశారట. ఆయన ఆరోజు చేసిన ఒకే ఒక్క తప్పు నాని కెరియర్ ని పూర్తిగా మార్చేసిందట. మరి ఇంతకీ ఆ రిసెప్షనిస్ట్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.నాని రియల్ నేమ్ అందరూ నానినే అని అనుకుంటారు.కానీ నాని రియల్ నేమ్ నవీన్ కుమార్ అట. కానీ ఈ విషయం చాలామందికి తెలియదు.. అయితే ఈ విషయాన్ని నాని తాజాగా జగపతిబాబు హోస్టుగా చేసే జయమ్ము నిశ్చయమ్మురా షోలో పంచుకున్నారు.నాని ఈ షోలో మాట్లాడుతూ.. నా అసలు పేరు నవీన్ కుమార్..కానీ ఈ విషయం ఎవరికీ తెలియదు.

అలాగే స్కూల్ డేస్  చదువుతున్నప్పుడు అంటే 8వ తరగతి చదువుతున్న సమయంలో మా నాన్న ఈడ్పుగల్లులోని సిద్ధార్థ్ హై స్కూల్లో వేశారు. ఆ సమయంలో నా అల్లరి భరించలేక స్కూల్ వాళ్ళు టీసీ ఇచ్చి పంపించేశారు. అయితే అలా టీసీ ఇచ్చిన సమయంలో రిసెప్షనిస్టు మా నాన్న పేరు రాంబాబు అని తెలుసుకొని రాశారు. నా పేరు నవీన్ అని రాసే బదులు ఈయన తండ్రి పేరు రాంబాబు అయినప్పుడు ఈయనకు ఉత్తీ నవీన్ అని ఎలా ఉంటుంది. ఈయన పేరు నవీన్ బాబు కావచ్చు అంటూ టీసీ లో రాసేశారు.ఇక ఆయన ఆరోజు నవీన్ బాబు అని రాయడంతో అప్పటినుండి ఆధార్ కార్డు, పాన్ కార్డు,పాస్ పోర్ట్, సర్టిఫికెట్స్ ఇలా ప్రతి ఒక్కదాంట్లో నా అసలు పేరు పక్కనపెట్టి నవీన్ బాబు అనే పెట్టుకున్నాను.ఆ రిసెప్షనిస్ట్ చేసిన ఆ చిన్న తప్పు నా పేరునే మార్చేసింది. అలా నవీన్ కుమార్ గా ఉన్న నా పేరు నవీన్ బాబు అని అఫీషియల్ గా మారిపోయింది.

కానీ నా అసలు పేరు నవీన్ కుమార్ అనే సంగతి చాలా మందికి తెలియదు. ఇక నవీన్ బాబు పోయి నాని అనే పేరు ఎలా వచ్చిందంటే.. చిన్నప్పటి నుండి నన్ను అందరూ నాని నాని అంటూ ప్రేమగా పిలిచేవారు.. ఇంట్లో పిలిచినట్టే స్కూల్లో కూడా అలాగే పిలిచేవారు. అలా నాని అనే పేరుకు నేను చాలా కనెక్ట్ అయిపోయాను.నా అసలు పేరు నవీన్ కుమార్ కంటే నానికే కనెక్ట్ అయ్యాను. అంతే కాదు నాని నాకు సెంటిమెంట్ నేమ్ గా మారిపోయింది. అందుకే సినిమాల్లోకి వచ్చాక కూడా నాని అనే పేరు నాకు కలిసి వచ్చింది.ఇక ఈ కారణం వల్లే నా అసలు పేరును నేను ఎక్కడా చెప్పుకోను.అందరికీ నాని గానే పరిచయం అయ్యాను..అంటూ తన లైఫ్ లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పుకొచ్చారు నాని.

మరింత సమాచారం తెలుసుకోండి: