సాధారణంగా స్టార్ సెలబ్రిటీస్, డబ్బున్న వారు లగ్జరీ లైఫ్ గడుపుతూ, రకరకాల ఫుడ్ లని ఇష్టపడుతూ ఉంటారు. కాంటినెంటల్, చైనీస్, ఇటాలియన్ వంటి హై రేంజ్ ఫుడ్ ఐటమ్స్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. వారు ఎక్కడికైనా బయటికి వెళ్లినా తమ స్టేటస్‌కి తగ్గట్టు అలాంటి ఫుడ్‌ను ఆర్డర్ ఇస్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన, సర్వసాధారణంగా అందరూ చూసే విషయమే. కానీ ఇండస్ట్రీలో ఒక హీరో ఉన్నాడు. ఎక్కడికి వెళ్లినా సరే తెలుగింటి సాంప్రదాయ వంటకాలను మాత్రమే ఇష్టపడతాడు. ఏ దేశానికి వెళ్లినా ఆయనకు తెలుగింటి సాంప్రదాయ వంటకాలు తప్పనిసరిగా టేబుల్‌పై ఉండాలి. వంద రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నా కూడా ఆయనకు అన్నం, పప్పు, ఆవకాయ, రసం, పెరుగు తప్పనిసరిగా ఉండాలి. ఇవి ఉంటేనే భోజనం చేస్తాడు.. లేకపోతే భోజనం చేయడమే మానేస్తాడు.


ఇంతకీ ఆ హీరో ఎవరో అనుకుంటున్నారా? ఆయన మరెవరో కాదు.. కోట్లాది మంది జనాలు అభిమానించే పవన్ కళ్యాణ్. నేడు ఆయన పుట్టినరోజు . ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలువురు స్టార్స్, సినీ ప్రముఖులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పవన్ కళ్యాణ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన రకరకాల ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌కి ఫేవరెట్ ఫుడ్ ఏంటన్నదీ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా ట్రెండ్ అవుతుంది.



గతంలో చాలా ఇంటర్వ్యూల్లో పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని చెప్పారు. “ఫుడ్ విషయంలో నేను ఎలాంటి రెస్ట్రిక్షన్స్ పెట్టను, కానీ తెలుగింటి ఫుడ్ అయితే ఇష్టంగా తింటాను” అని ఆయనే చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ సిస్టర్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్ కూడా పలు ఇంటర్వ్యూల్లో ఇదే విషయాన్ని చెప్పారు. “పవన్ ఫుడ్ విషయంలో అసలు ఇబ్బంది పెట్టడు, ఏది ఉంటే అది తింటాడు, తెలుగింటి సాంప్రదాయ వంటకాలను మాత్రం చాలా ఇష్టంగా తింటాడు” అని వారు చెప్పారు. పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో అనుకుంటే ఇంట్లో 50 మంది షెఫ్స్ పెట్టించుకుని రకరకాల వంటకాలు వండించుకుని తినగలడు. కానీ ఆయన మాత్రం సింపుల్ లైఫ్‌స్టైల్‌ను ఇష్టపడతారు. ఆయన పుట్టిన, పెరిగిన వాతావరణానికి కట్టుబడి తన అలవాట్లను ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ విషయంలో నిజంగా పవన్ కళ్యాణ్‌కి హ్యాట్సాఫ్ అంటున్నారు పవర్ స్టార్ అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: