
మలయాళంలో కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ‘కొత్త లోక చాప్టర్ 1 – చంద్ర’ తెలుగులోనూ సూపర్ గా, స్ట్రాంగ్ వసూళ్లతో దూసుకుపోతోంది. వర్కింగ్ డేస్‌లో కూడా ఈ సినిమా జోరు కొనసాగిస్తోందంటే కొత్త లోక సినిమా ఎంత కొత్తగా ఉందో తెలుస్తోంది. మళయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నిర్మించిన ఈ సినిమా ఇప్పుడు పెద్ద మైలురాయిని అందుకుంది. లోక ప్రస్తుతం సౌత్‌లో లేడీ ఓరియంటెడ్ మూవీస్‌లో ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచి సరికొత్త రికార్డులు తన ఖాతాలో వేసుకుంటోంది. కేవలం రిలీజ్ అయిన 6 రోజులకే రూ.93 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఈ రికార్డు ఇంతకుముందు కీర్తి సురేష్ నటించిన ‘మహానటి’ పేరిట ఉండేది.
నాగ్ అశ్విన్ దర్శకత్వం, వైజయంతీ మూవీస్ నిర్మాణంలో వచ్చిన ఆ బయోపిక్ 2018లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.85 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. ఇప్పుడు కొత్త లోక మహానటి రికార్డును బ్రేక్ చేసింది. ఇక ఏడు సంవత్సరాల తర్వాత ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కొత్త లోక సెన్షేషనల్ విజయం సాధించడంతో మరోసారి సౌత్ సినీ ఇండస్ట్రీలో మళయాళ సినీ పరిశ్రమ సెన్షేషన్ అయ్యింది. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నస్లెన్, శాండీ కీలక పాత్రలు పోషించారు. తెలుగులో ఈ సినిమాను నాగ వంశీ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై విడుదల చేశారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు