సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది కి సంక్రాంతి హీరోగా , సంక్రాంతి దర్శకుడిగా , సంక్రాంతి నిర్మాతగా పేరు ఉంది. అలా ఉండడానికి ప్రధాన కారణం వారు ఎక్కువ శాతం తమ సినిమాలను సంక్రాంతి బరిలో నిలపడానికి చూడడమే. అలా తమ సినిమాలను సంక్రాంతి బరిలో  నిలిపి కొన్ని సినిమాలతో మంచి విజయాలను అందుకోవడంతో అలా ఎక్కువ శాతం వారు సంక్రాంతి బరిలో నిలుస్తూ ఉండడంతో వారికి సంక్రాంతి హీరోలు , దర్శకులు , నిర్మాతలు అని పేరు వస్తూ ఉంటుంది. ఇకపోతే తాజాగా ఓ ముద్దుగుమ్మ సంక్రాంతి హీరోయిన్గా పేరు తెచ్చుకునే అవకాశాలు కనబడుతున్నాయి.

బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరి ఎవరో కాదు ... తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న ముద్దుగుమ్మలలో ఒకరు అయినటువంటి మీనాక్షి చౌదరి. ఈమె ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈమె నటించిన సినిమాలు ఈ మధ్య కాలంలో సంక్రాంతికి వరుసగా విడుదల అవుతున్నాయి. పోయిన సంవత్సరం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారం సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంది. 

ఇక విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ నవీన్ పోలిశెట్టి హీరో గా రూపొందుతున్న అనగనగా ఒక రాజు సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండక్కి  విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇలా మీనాక్షి నటిస్తున్న సినిమాలు వరుస పెట్టి సంక్రాంతికి విడుదల అవుతూ వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

mc