సినిమా ఇండస్ట్రీ లో కొంత మంది కి కొంత కాలం అద్భుతంగా కలిసి వస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో వారికి నటించిన సినిమాలతో అద్భుతమైన విజయాలు దక్కుతాయి. దానితో వారి క్రేజ్ అద్భుతమైన స్థాయిలో పెరుగుతుంది. అలాంటి వారికి కొన్ని సమయాలలో భారీ అపజయాలు కూడా దక్కుతూ ఉంటాయి. ఇక ప్రస్తుతం అలాంటి పరిస్థితుల్లోనే ఓ బ్యూటీ కెరియర్ను కొనసాగిస్తుంది. ఇంతకు ఆ నటి ఎవరూ అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు రకుల్ ప్రీత్ సింగ్. ఈ బ్యూటీ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కూడా రకుల్ మంచి విజయాలను అందుకొని అద్భుతమైన రీతిలో కెరియర్ను ముందుకు కొనసాగించింది.

ఈమెకు 2016 వ సంవత్సరం అద్భుతమైన రీతిలో కలిసి వచ్చింది. ఈమె 2016 వ సంవత్సరం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన నాన్నకు ప్రేమతో , అల్లు అర్జున్ హీరోగా రూపొందిన సరైనోడు , రామ్ చరణ్ హీరోగా రూపొందిన ధ్రువ సినిమాల్లో  హీరోయిన్గా నటించింది. ఈ మూడు సినిమాలు కూడా అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఈ మూడు సినిమాలతో ఈమె కెరియర్ గ్రాఫ్ ఒక్క సారిగా పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత ఈమెకు ఆ స్థాయి విజయాలు దక్కలేదు. 2016 వ సంవత్సరం తర్వాత ఈమె నటించిన సినిమాల్లో రారండోయ్ వేడుక చూద్దాం ,  జయ జానకి నాయక సినిమాలో కాస్త పరవాలేదు అనే స్థాయి విజయాలను అందుకున్నాయి. 

కానీ ఈ రెండు సినిమాల తర్వాత మాత్రం ఈమె నటించిన ఏ తెలుగు సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకోలేదు. దానితో ఈమెకు వరుస అపజయాలు దక్కడంతో ఈమె ప్రస్తుతం తెలుగు సినిమాల్లో నటించడం లేదు. ఎక్కువ శాతం తమిళ్ , హిందీ సినిమాల్లో నటిస్తూ కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ఆఖరుగా ఈమె తెలుగులో కొండపొలం  అనే సినిమాలో నటించింది. ఈ సినిమా 2021 వ సంవత్సరం విడుదల  అయింది. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: