
అయితే ఈ సినిమా హిట్ కాకపోవచ్చని ముందే ఊహించానని నిర్మాత అనిల్ సుంకర షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మాటల్లోనే – “రిలీజుకు మూడు నెలల ముందే సినిమా చూసినప్పుడు నా మనసులో ఒక డౌట్ వచ్చింది. మహేష్ బాబును ఒక డిసీజ్ ఉన్న హీరోలా చూపించడం నాకు హజం కాలేదు. ప్రేక్షకులు అంగీకరిస్తారా అన్న అనుమానం కలిగింది. నేను నా భార్యతోనే ఈ భయం పంచుకున్నాను. కానీ ఆమెకు మాత్రం సినిమా నచ్చింది. అయినా నా ఫీలింగ్ మాత్రం అలాగే కొనసాగింది – ఇది వర్కౌట్ కాకపోవచ్చు” అని చెప్పారు.
భారీ బడ్జెట్‌తో (రూ. 60–70 కోట్ల మధ్య) 14 రీల్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ ప్రాజెక్ట్ అప్పట్లో టాలీవుడ్‌లో కాస్ట్ పరంగా అగ్రస్థానంలో నిలిచింది. కానీ మిశ్రమ స్పందన రావడంతో నిర్మాతలకు భారీ నష్టాలు వచ్చాయి. “మేము రిలీజ్‌కి ముందు ట్రైలర్ లాంచ్ చేయలేదని ఇప్పుడు అర్థమవుతోంది. ముందే సినిమాకు సంబంధించిన టోన్, థీమ్ చెప్పి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. థియేటర్‌లోకి వెళ్లాకే హీరోకి జబ్బు ఉందని తెలిసి ఫ్యాన్స్ షాక్ అయ్యారు. వాళ్లు యాక్షన్ సినిమా అనుకుని వచ్చారు. ప్రిపేర్ కాకపోవడం వాళ్లలో నిరాశ పెంచింది” అని అనిల్ సుంకర విశ్లేషించారు. మహేష్ బాబు కోసం ఆ సినిమా రెండు సంవత్సరాల కష్టపడి చేశారని, ఆయన మాత్రం స్క్రిప్ట్‌పై నూరుశాతం నమ్మకం పెట్టుకున్నారని కూడా చెప్పారు.
“మహేష్ ఏ సినిమా చేసినా పూర్తిగా నమ్మి చేస్తాడు. అందుకే '1' ఫ్లాప్ కావడం ఆయనకు షాక్ ఇచ్చింది. కానీ అదృష్టవశాత్తూ తర్వాత ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడాల్సిన పరిస్థితి రాలేదు. అన్నీ సినిమాలు పాజిటివ్ ఫలితాలే ఇచ్చాయి” అని గుర్తుచేశారు. ప్రస్తుతం అనిల్ సుంకర ‘షో టైమ్ - సినిమా తీద్దాం రండి’ అనే కొత్త రియాలిటీ షోతో బిజీగా ఉన్నా, '1: నేనొక్కడినే' అనుభవం మాత్రం ఆయన మనసులో గాఢమైన ముద్ర వేసినట్టు కనిపిస్తోంది. మొత్తానికి, కాలానికి ముందే వచ్చిన సినిమా '1: నేనొక్కడినే'. అప్పట్లో ప్రేక్షకులు హజం చేసుకోలేకపోయినా, ఇప్పుడు ఆ చిత్రానికి ఉన్న క్రేజ్, కల్ట్ స్టేటస్ చూస్తే – మహేష్ & సుకుమార్ చేసిన ఆ రిస్క్ తప్పు కాదని చాలా మంది అంటున్నారు.