టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటి మనలో షకీలా ఒకరు.. 90s లో ఈమెకు మామూలు క్రేజ్ ఉండేది కాదు. ఈమె ఓ సినిమాలో చేస్తుంది అంటే తప్పకుండా థియేటర్లు ఫుల్ అయిపోయాయి. ప్రతి సినిమాలో  షకీలా కి సంబంధించిన వ్యాపు పాత్రలను తప్పనిసరిగా డిజైన్ చేసేవారు దర్శకులు. అలా ఆమె ద్వారా సినిమాను హిట్ చేసుకునేవారు.  అలా కొన్ని సంవత్సరాలపాటు షకీలా అద్భుతంగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. అలాంటి షకీలా ఇండస్ట్రీలో  వేణుమాధవ్ తో మంచి ఫ్రెండ్షిప్ ఉండేదట. కానీ ఒకానొక సమయంలో వేణుమాధవ్ వల్ల షకీలా చాలా భయపడి పోయిందట. వేణుమాధవ్ ఉండే రూమ్ కి షకీలా వెళ్లినప్పుడు వేణుమాధవ్ బెడ్ పై ఆ విధంగా చేయడంతో ఆమె భయంతో వనికి పోయిందట. ఇంతకీ వేణుమాధవ్ ఏం చేశారు వివరాలు చూద్దాం.. 

అయితే ఒక సినిమా షూటింగ్ సమయంలో వీరంతా ఒకే హోటల్లో బస చేశారట. అయితే సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత హోటల్ కి వచ్చేసరికి షకీలా ఉండే రూమ్లో వేరే వ్యక్తులంతా గోల గోల చేశారట. దీంతో అక్కడ పడుకోవడం ఇష్టం లేనటువంటి షకీలా వేణుమాధవ్ రూమ్ కి వెళ్లి నేను ఇక్కడ పడుకుంటాను అని చెప్పిందట. కానీ ఆ రూమ్ లో ఒకటే బెడ్ ఉంది.. వెంటనే షకీలా ను కాసేపు కూర్చోమని చెప్పి ఆ బెడ్ పై అటు ఇటు  అంతా సెట్ చేశారట.. ఆ తర్వాత షకీలాతో నేను ఒక విషయం అడుగుతాను ఏమనుకోవద్దు.. అసలు ఏమనుకోవద్దు అంటూ ఆమెతో అన్నాడట.. దీంతో మనసులో వణికిపోయినా షకీలా  అసలు వీడు ఏం అడుగుతాడు,

 అసలు విని రూమ్ లోకి నీ వచ్చినందుకు తప్పు చేశాను అని మరో విధంగా ఫీల్ అయిందట. వెంటనే వేణుమాధవ్ మీరు ఒక సైడ్ పడుకోండి.. నేను మరో సైడ్ పడుకుంటాను.. కానీ మన మధ్యలో పిల్లోస్ పెడుతున్నాను.. ఎందుకంటే నాకు పెళ్లయింది పిల్లలు ఉన్నారు.. మీరు నిద్రలో ఒకవేళ నాపై కాలు వేసి ఈ పక్క తిరిగితే  నేను చచ్చిపోతాను అంటూ  చెప్పుకొచ్చారట. దీంతో షకీలా రాత్రంతా నవ్వుకుంటూ ఉన్నానని చెప్పింది. విషయాన్ని మరుసటి చూడు షూటింగులో బ్రహ్మానందం ఇతర కమెడియన్లతో కూడా చెప్పుకుంటూ చాలా నవ్విందట. వేణుమాధవ్ మరణించిన తర్వాత షకీలా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని బయట పెట్టింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: