
1. ప్రభాస్ : టాలీవుడ్ నుంచి పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగిన మొదటి హీరో పేరు చెప్పమంటే ప్రభాస్ అని ధైర్యంగా చెప్పొచ్చు. బాహుబలి సిరీస్‌తో ప్రభాస్ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. అతను ఒక్కో సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ, ఇండస్ట్రీలో రికార్డ్ సృష్టించాడు. ఆదిపురుష్, సలార్, కల్కి 2898 ఆడ్ వంటి భారీ సినిమాలతో ప్రభాస్ రేంజ్ మరింత పెరిగింది. ఆయన మార్కెట్ దృష్ట్యా నిర్మాతలు ముందుగానే వంద కోట్లకు పైగా చెక్కులు ఇచ్చేస్తుంటారు. అది ఇప్పుడు నార్మల్‌గా మారింది.
2. జూనియర్ ఎన్టీఆర్ : ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మార్కెట్ పాన్-ఇండియా స్థాయికి వెళ్లిపోయింది. రాజమౌళి దర్శకత్వంలో నటించిన ఈ సినిమా గ్లోబల్ లెవెల్లో అద్భుత విజయం సాధించడంతో ఎన్టీఆర్‌కు భారీ క్రేజ్ వచ్చింది.
ఇప్పటికే దేవర సినిమా కోసం సుమారు 80-90 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ అందుకున్నాడనే వార్తలు వచ్చాయి. వార్ 2 వంటి బిగ్ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ రెమ్యూనరేషన్ 100 కోట్ల మార్క్‌ను దాటింది.
3. రామ్ చరణ్ : మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కూడా ఆర్ ఆర్ ఆర్ సక్సెస్ తర్వాత గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మగధీర నుంచి రంగస్థలం వరకు ఎన్నో బ్లాక్‌బస్టర్స్ ఇచ్చిన రామ్ చరణ్, ఇప్పుడు తన మార్కెట్‌ను పాన్-ఇండియా స్థాయికి పెంచుకున్నాడు. ఆయన ఒక్కో సినిమాకు 100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. అదేవిధంగా ప్రాఫిట్-షేరింగ్ మోడల్ ద్వారా కూడా మంచి లాభాలు అందుకుంటున్నాడు.
4. అల్లు అర్జున్ : పుష్ప సినిమాతో అల్లు అర్జున్ తన క్రేజ్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లాడు. ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలో మాస్ కల్ట్ క్రేజ్ తెచ్చింది. ఆ తరువాత పుష్ప 2 కోసం ఆయన 120 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకున్నాడని టాక్.
స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ ఇప్పుడు ఇండస్ట్రీలో హైయెస్ట్ పెయిడ్ హీరోల్లో ఒకడిగా నిలిచాడు.
5. మహేష్ బాబు: సూపర్‌స్టార్ మహేష్ బాబు ఎప్పటికీ టాలీవుడ్‌లో టాప్ 5 స్టార్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఆయన సిగ్నేచర్ స్టైల్, క్లాస్-మాస్ ఇమేజ్ వల్ల మార్కెట్ ఎప్పుడూ స్ట్రాంగ్‌గా ఉంటుంది. ప్రస్తుతం మహేష్ ఒక్కో సినిమాకు 70 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. రాజమౌళి దర్శకత్వంలో వహిస్తున్న సినిమా కోసం అయితే 80 కోట్లకు పైగా డీల్ ఫిక్స్ చేశాడని టాక్.