టాలీవుడ్ ఇండస్ట్రీ లో అదిరిపోయే రేంజ్ క్రేజ్ కలిగిన నటి మనులలో ఒకరిగా కెరీర్ను కొనసాగిస్తున్న వారిలో శ్రీ లీల ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించింది. ఈమె నటించిన సినిమాలలో చాలా తక్కువ సినిమాలు మంచి విజయాలను అందుకున్న ఈమె నటించిన సినిమాలలో చాలా శాతం సినిమాల్లో ఈ బ్యూటీ తన అందాలతో , డ్యాన్స్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈమెకు అద్భుతమైన గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో ఉంది. దానితో ఈమెకు స్టార్ హీరోల సినిమాలలో , అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోల సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి.

ప్రస్తుతం ఈ బ్యూటీ మాస్ మహారాజ రవితేజ హీరో గా రూపొందుతున్న మాస్ జాతర అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే రవితేజ , శ్రీ లీల కాంబోలో రూపొందిన ధమాకా సినిమా మంచి విజయం సాధించి ఉండడంతో మాస్ జాతర మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప పార్ట్ 2 మూవీ రూపొందిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల ఐటమ్ సాంగ్ లో నటించింది. ఈ మూవీ లోని ఐటమ్ సాంగ్ ద్వారా శ్రీ లీల కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు దక్కింది. తాజాగా శ్రీ లీల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది.

అందులో భాగంగా ఈ బ్యూటీ అల్లు అర్జున్ గురించి , కిస్సిక్ సాంగ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. తాజాగా శ్రీ లీల మాట్లాడుతూ ... అల్లు అర్జున్ గారు బయట చాలా సైలెంట్ గా కనిపిస్తారు. కానీ సెట్స్ లోకి రాగానే చాలా ఎనర్జీతో ఉంటాడు. పుష్ప 2 లోని కిస్సిక్ సాంగ్ కోసం ఐదు రోజులు మాత్రమే అల్లు అర్జున్ గారితో పని చేశా. కానీ అది నాకు క్రాష్ కోర్సుల అనిపించింది అని శ్రీ లీల చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: