కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్ క్రేజ్ ను సంపాదించుకున్న వారిలో లోకేష్ కనగరాజు ఒకరు. ఈయన అత్యంత చిన్న వయసులో తక్కువ సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ ఈమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఇకపోతే కెరియర్ ప్రారంభంలో వరస పెట్టి అద్భుతమైన విజయాలను అందుకున్న ఈయన ప్రస్తుతం మాత్రం ఆ స్థాయిలో విజయాలను అందుకోవడంలో చాలా వెనుకబడిపోయాడు. ఈయన కెరియర్లో కార్తీతో రూపొందించిన ఖైదీ , కమల్ హాసన్ తో రూపొందించిన విక్రమ్ సినిమాలు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. విక్రమ్ మూవీ తర్వాత ఈయన తలపతి విజయ్ హీరోగా లియో అనే సినిమాను రూపొందించాడు.

భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేదు. ఈ మూవీ తర్వాత ఈయన సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా కూలీ అనే సినిమాను రూపొందించాడు. కొంత కాలం క్రితం విడుదల అయిన ఈ సినిమా కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే కూలీ సినిమా చిత్రీకరణ దశలో ఉన్న సమయంలో కూలీ మూవీ తర్వాత లోకేష్ బాలీవుడ్ స్టార్ నటనలో ఒకరు అయినటువంటి ఆమీర్ ఖాన్ హీరో గా ఓ మూవీ చేయబోతున్నట్లు , ఆ తర్వాత రజనీ కాంత్ కమల్ హాసన్ హీరోలుగా మరో మూవీ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇక కూలీ సినిమా అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోకపోవడంతో ఆమీర్ తో లోకేష్ సినిమా క్యాన్సల్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. రజిని , కమల్ తో కూడా మూవీ ఉందా ... లేదా అనేది అధికారిక ప్రకటన లేదు. దానితో ఈయన ఖైదీ 2 మూవీ పై ఫోకస్ పెట్టనున్నట్లు , లోకేష్ తన తదుపరి మూవీ గా ఖైదీ 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

lk