గత కొంత కాలంగా స్టార్ హీరోలు నటించిన సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున టికెట్ రేట్లను పెంచేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక స్టార్ హీరోలు నటించిన సినిమాలకు టికెట్ రేట్లను భారీగా పెంచిన కూడా వారి అభిమానులు అలాగే మామూలు ప్రేక్షకులు కూడా ఆ సినిమాలను పెద్ద ఎత్తున చూస్తున్నారు. ఒక వేళ సినిమాకు గనుక మంచి టాక్ వచ్చినట్లయితే పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టి కూడా సినిమాలు చూడడానికి సామాన్య ప్రేక్షకులు కూడా కొంత మంది వెనకాడడం లేదు. దానితో సినిమా బాగున్నట్లయితే స్టార్ హీరోల సినిమాలకు ఎక్కువ టికెట్ రేట్లు పెట్టినా కూడా జనాలు చాలా వరకు వస్తూ ఉండడంతో స్టార్ హీరోలు నటించిన సినిమాలకు దాదాపుగా టికెట్ రేట్లను పెంచుతున్నారు.

ఇకపోతే టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఓజి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను సెప్టెంబర్ 25 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ టికెట్ ధరలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెంచారు. ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్ షో లను సెప్టెంబర్ 25 వ తేదీన అర్ధరాత్రి నుండి ప్రదర్శించనున్నారు.

మూవీ ప్రీమియర్ షో టికెట్ ధరలను 1000 రూపాయలుగా ఖరారు చేశారు. అదే విధంగా ఈ సినిమా యొక్క టికెట్ ధరలను సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 125 రూపాయలు పెంచనున్నట్లు , మల్టీ ప్లెక్స్ లో 150 రూపాయలను పెంచనున్నట్లు ఈ పెంపును సినిమా విడుదల తర్వాత పది రోజుల పాటు అమలు చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా జీవోను జారీ చేసింది. ఇక ఈ సినిమా టికెట్ రేట్లు భారీగా పెరగనున్న నేపథ్యంలో ఈ మూవీ కి గనుక మంచి టాక్ వచ్చినట్లయితే ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసే అవకాశాలు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: