
సాయి తేజ్ హీరోగా, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. రిలీజ్ అయిన ఐదు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ అయి సెన్సేషనల్ రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో మంచు మనోజ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. కానీ ఆ సినిమాకి అదనపు హైప్ రావడానికి ప్రధాన కారణం ప్రభాస్ ఇచ్చిన వాయిస్ ఓవర్ అని చెప్పక తప్పదు.ఇక ఇప్పుడు అదే తరహా ట్రెండ్‌ను అనుసరించేలా మరో సూపర్ కాంబినేషన్ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కూడా అల్లు అర్జున్ నటిస్తున్న ఒక సినిమాకి తన వాయిస్ ఇవ్వబోతున్నాడట. ఈ సినిమా డైరెక్షన్ బాధ్యతలు స్టార్ డైరెక్టర్ అట్లీ తీసుకున్నారు. కథ ప్రకారం అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్‌లో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ వినిపించబోతోందట. ఈ ప్లాన్ వెనుక ఉన్న కారణం కూడా ఆసక్తికరంగా ఉంది.
బన్నీ, తారక్‌ల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. అట్లీ కూడా ఆ ఫ్రెండ్‌షిప్‌ను స్మార్ట్‌గా యూజ్ చేసుకుని ఈ కొత్త యూనిక్ ఐడియాతో ముందుకు వచ్చారని ఫిలింనగర్‌లో టాక్. అల్లు అర్జున్ స్క్రీన్‌పై కనిపిస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ వినిపిస్తే, అభిమానులకి కలిగే గూస్బమ్స్ సీన్స్ గురించి ఇప్పటికే ఊహించుకుంటూ ఎగ్జైట్మెంట్ వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా, స్టార్ హీరోల వాయిస్ ఓవర్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌గా మారాయి. ఒక స్టార్ హీరో సినిమా కోసం మరొక స్టార్ హీరో తన వాయిస్ ఇస్తే, అది సినిమాకి మాత్రమే కాకుండా అభిమానుల ఎమోషన్లకి కూడా డబుల్ బూస్ట్ ఇస్తోంది. అందుకే జనాలు ఈ వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ, "తారక్ వాయిస్ – బన్నీ విజువల్స్" అనే కాంబినేషన్‌పై బలమైన హైప్ క్రియేట్ చేస్తున్నారు.