
వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం ప్రస్తుతం భారీ లాభాలతో ఫుల్ స్టడీగా థియేటర్స్ లో రన్ అవుతోంది. ఈ సంగతి పక్కన పెడితే.. మిరాయ్‌లో భయస్తుడైన పోలీస్ పోలీస్ ఇన్స్పెక్టర్‌గా నటించిన వ్యక్తిని గుర్తుపట్టారా? అతను టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ మరియు రచయిత కూడా. ఇంతకీ ఆయన మరెవరో కాదు కిషోర్ తిరుమల. 2008లో రైటర్ గా కెరీర్ ప్రారంభించిన కిషోర్.. `సెకండ్ హ్యాండ్` మూవీతో డైరెక్టర్‌గా మారారు.
`పవర్`, `కరెంట్ తీగ`, `శివం` వంటి హిట్ చిత్రాలకు మాటలతో పాటు పాటలు రాశారు. 2016లో `నేను శైలజ` మూవీతో డైరెక్టర్ గా తొలి బిగ్ హిట్ అందుకుని అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత కిషోర్ తిరుమల నుంచి `ఉన్నది ఒకటే జిందగీ`, `చిత్రలహరి`, `రెడ్` వంటి చిత్రాలు వచ్చాయి. తాజాగా మిరాయ్ లో సీఐ అశోక్ పాత్రలో మెరిశారు. తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. తనలోని యాక్టింగ్ టాలెంట్ ను అందరికీ పరిచయం చేశారు.
మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. మిరాయ్ లో కిషోర్ తిరుమలతో పాటు మరో డైరెక్టర్ కూడా ఉన్నారు. అతనే `కేరాఫ్ కంచరపాలెం` సినిమా తీసిన డైరెక్టర్ వెంకటేష్ మహా. ఈయన సీఐ అశోక్ కు బాస్‌గా విక్రమ్ పాత్రలో అలరించారు. వెంకటేష్ మహా ప్రస్తుతం ఓవైపు డైరెక్టర్‌గా సినిమాలకు, వెబ్ సిరీస్‌లకు పనిచేస్తూనే.. మరోవైపు నటుడిగా కంటిన్యూ అవుతున్నాడు.