
మెగాస్టార్ చిరంజీవి ని చూసి సినీ రంగంలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్, ఆయనని అనుసరించినా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని, స్వతంత్రంగా ఓ లెగసీని సృష్టించుకున్నాడు. చిరంజీవి తర్వాత ఇలా అద్భుతమైన స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే అని విశ్లేషకులు చెబుతున్నారు. నిజానికి చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని మించి రికార్డ్స్ క్రియేట్ చేస్తూ, ఫ్యాన్స్ హృదయాల్లో “దేవుడి” స్థాయిలో నిలిచిపోయాడు పవన్ కళ్యాణ్.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో వస్తున్న “ఓ జి” సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. అయితే ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ కి వైరల్ ఫీవర్ రావడం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వార్త విన్న ఫ్యాన్స్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన త్వరగా కోలుకోవాలని, ఓ జి రికార్డ్స్ ని స్వయంగా చూసి ఆనందించాలని కోరుకుంటున్నారు.
కొంతమంది అభిమానులు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుపడాలని ఉపవాసాలు ఉంటున్నారు. ఇంకొందరు గుడుల్లో ప్రత్యేక పూజలు, అన్నదానాలు నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలిసిన సినీ విశ్లేషకులు కూడా ఆశ్చర్యపోతూ, “ఇది కేవలం ఫ్యాన్స్ స్థాయిలో ఉన్న అభిమానమే కాదు, భక్తుల స్థాయిలో ఉన్న ఆరాధన” అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజమైన అభిమానం అంటే ఇదే – తనకు ఇష్టమైన హీరోకి ఏ సమస్య వచ్చినా, తనను తాను మరిచి ఆ హీరో కోసం ప్రార్థించే స్థాయిలో ఉండడం. పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ నిజమైన అర్థంలో అలా ప్రవర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో వీరి అంకితభావం పెద్ద ఎత్తున వైరల్ అవుతోంది. చాలా మంది నెటిజన్స్ కూడా “ఇలాంటి అభిమానులు దక్కడం నిజంగా పవన్ కళ్యాణ్ గ్రేట్‌నెస్ కి నిదర్శనం” అని కామెంట్స్ చేస్తున్నారు.
సినిమా హీరోలని అభిమానించే వాళ్ళు చాలామందే ఉంటారు. కానీ హీరోని దేవుడిగా ఆరాధించే స్థాయిలో ప్రేమించే అభిమానులు చాలా అరుదు. ఆ రేర్ లవ్, ఆ రేర్ ఫాలోయింగ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మాత్రమే దక్కింది. అందుకే ఆయనని “హీరో” కంటే ఎక్కువగా, “దేవుడు” లా భావించే స్థాయికి వెళ్లారు ఫ్యాన్స్.అందుకే అంటారు – పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే అభిమానులు కాదు, భక్తులు. అలాంటి భక్తులను సంపాదించుకోవడం నిజంగా పవన్ కళ్యాణ్ వెరీ గ్రేట్ అని చెప్పక తప్పదు.