టాలీవుడ్‌లో స్టార్ హీరోలంటే సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే, ఆయన ఇప్పటికే ఎన్నో బ్లాక్‌బస్టర్ సినిమాలు చేసి, విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అలాంటి పవన్ కళ్యాణ్‌  వరుసగా రెండు సినిమాలు డైరెక్ట్ చేసిన సుజిత్ లాంటి దర్శకుడికి "ఓజీ" అనే భారీ ప్రాజెక్ట్‌ను అప్పగించడం నిజంగా చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. “అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు సుజిత్‌పై అంత నమ్మకం పెట్టుకున్నాడు? ఆయనలో ఏమి చూసి ఈ భారీ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు?” అన్నది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.ఇక అసలు విషయం ఏమిటంటే—సుజిత్ ఎలాంటి మాయ మాటలు చెప్పకుండానే, కేవలం కొన్ని లైన్లలోనే "ఓజీ" కథను పవన్ కళ్యాణ్‌కి వివరించాడట. ఎక్కువ హైప్ లేకుండా, సింపుల్‌గా నాలుగు ఐదు లైన్లలోనే మొత్తం కథను సూటిగా చెప్పేశాడని ఇండస్ట్రీ టాక్. ఆ చిన్న చిన్న లైన్లలోనే ఉన్న పవర్‌ఫుల్ ప్రెజెంటేషన్‌కి పవన్ కళ్యాణ్ ఇంప్రెస్ అయ్యి వెంటనే సినిమా చేయడానికి ఓకే చెప్పేశారట.


ఇందులో అసలు హైలైట్ ఏమిటంటే—ఇది ఒక గ్యాంగ్‌స్టర్ డ్రామా. పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎన్నో రకాల కాన్సెప్ట్‌లతో సినిమాలు చేశాడు. కానీ ఈ తరహా ఇంటెన్స్ గ్యాంగ్‌స్టర్ రోల్‌లో ఆయనను ప్రేక్షకులు ఎప్పుడూ చూడలేదు. అలాంటి కొత్తదనం ఉన్న పాత్రలో నటించే అవకాశం రావడంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమాను మిస్ కావల్సిన పనిలేదని భావించాడట. అదే కాకుండా సుజిత్ చూపించిన విజన్ కూడా ఆయనకు నచ్చింది.ఇక సుజిత్ గతంలో డైరెక్ట్ చేసిన "సాహో" సినిమాకి సంబంధించిన అనుభవం కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్‌కి నమ్మకం కలిగించిందని చెప్పుకోవాలి. "సాహో" సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్నా, సుజిత్ చూపించిన టెక్నికల్ స్టాండర్డ్స్, భారీ యాక్షన్ సీన్స్, హాలీవుడ్ స్థాయి మేకింగ్ మాత్రం అందరినీ ఆకట్టుకున్నాయి. అసలు "సాహో" ఫ్లాప్ అయ్యింది కథను ప్రేక్షకులకు కనెక్ట్ చేసే విధానంలో కానీ, కష్టం, అద్భుతమైన ప్రెజెంటేషన్‌లో మాత్రం సుజిత్ తన ప్రతిభను రుజువు చేసుకున్నాడు. ఆ విషయం పవన్ కళ్యాణ్ గమనించాడట.



అందుకే సాహో ట్రాక్ రికార్డు గురించి ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా, సుజిత్‌లో ఉన్న ప్యాషన్‌, టాలెంట్, ప్రెజెంటేషన్‌పై పూర్తి నమ్మకం పెట్టుకుని పవన్ కళ్యాణ్ ఆయనకి ఈ బిగ్ ప్రాజెక్ట్ అప్పగించాడు. ఇప్పుడు చూస్తే ఆ నిర్ణయం సక్సెస్ అవుతుందనేలా కనిపిస్తోంది. సినిమా ఇంకా రిలీజ్ కాకముందే "ఓజీ" బిజినెస్ రేంజ్ ఊహించని స్థాయిలో జరుగుతోంది. డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ మధ్య ఈ సినిమా మీద నమ్మకం పెరిగి పోతుంది.మొత్తానికి పవన్ కళ్యాణ్ సుజిత్‌లో చూసింది కేవలం ఒక సింపుల్ కాన్సెప్ట్‌నే కాదు—ఆయన చూపిన విజన్‌, కొత్తదనంతో కూడిన గ్యాంగ్‌స్టర్ డ్రామా, అలాగే డైరెక్టర్‌గా ఉన్న టాలెంట్‌. ఆ నమ్మకమే ఇప్పుడు "ఓజీ" సినిమాకి హైప్‌ని పెంచి మరింత బలంగా నిలబెడుతోంది. ఇక రాబోయే కొన్ని గంటల్లోనే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ టాక్ బయటకు రానుంది. ఆ టాక్ ఎలా ఉంటుందో చూడాలి కానీ, ఇప్పటివరకు ఉన్న అంచనాలు మాత్రం “ఓజీ”ని ఇండస్ట్రీ రికార్డులను దాటించేలా చూపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: