సాధారణంగా ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా, సినిమా విడుదలైన తర్వాతే రికార్డులు సృష్టించడం జరుగుతుంది. కానీ సినిమా థియేటర్లకు రాకముందే రికార్డులు క్రియేట్ చేస్తుందంటే, అది మరెవరిదీ కాదు – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా మాత్రమే అవుతుంది. ఇదే విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఫ్యాన్స్ మధ్య ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు రాజకీయాల్లో కూడా తనదైన స్టైల్‌లో ముందుకు దూసుకెళ్తున్నారు. అయినప్పటికీ సినిమాల పట్ల ఆయనకున్న ప్యాషన్, అభిమానుల పట్ల ఉన్న మమకారం వేరు. అందుకే ఆయన నటించిన ప్రతి సినిమా కోసం అభిమానులు ఎంతో ఎగ్జైట్మెంట్‌తో ఎదురుచూస్తారు. ఆయన లేటెస్ట్ మచ్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఓఘ్ పై కూడా అదే స్థాయిలో కాకుండా మరింత రెట్టింపు స్థాయిలో హైప్ క్రియేట్ అయింది.

ప్రత్యేకంగా ఈ సినిమాతో దర్శకుడు సుజిత్, ఖుషి నాటి పవన్ కళ్యాణ్ ఎనర్జీని, ఆ మ్యాజిక్‌ని మళ్లీ తెరమీదకు తీసుకురావడానికి ప్రయత్నించాడని ఫ్యాన్స్‌ నమ్ముతున్నారు. అందుకే ఈ సినిమా కోసం అనకాపల్లి నుండి అమెరికా వరకు, దేశమంతా, విదేశాల్లోనూ అభిమానులు ఈగరుగా ఎదురు చూస్తున్నారు. ఈ రోజు రాత్రి 10 గంటలకు ప్రీమియర్ షోలు మొదలవుతున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ రేంజ్ అవుట్ ఆఫ్ ది బాక్స్‌లో ఉన్నాయి. ఎక్కడైనా బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే కేవలం కొన్ని నిమిషాల్లోనే అన్ని షోలు సోల్డ్ అవుట్ అయ్యాయి. ఈ హంగామా చూస్తుంటే పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎంత స్థాయిలో ఉందో సులభంగా అర్థమవుతుంది.

అత్యంత కీలకమైన విజయవాడ మార్కెట్‌లో అయితే పవన్ కళ్యాణ్ రికార్డులు సృష్టించేశాడు. ఓజీ ప్రీమియర్స్‌తోనే విజయవాడ సినీ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్ సాధించాడు. విజయవాడలోని మొత్తం ఎనిమిది సింగిల్ స్క్రీన్ థియేటర్స్‌లో ఒకేసారి రిలీజ్ అవుతున్న ఈ ప్రీమియర్స్ కోసం టికెట్లు ఓపెన్ అవగానే పూర్వం ఎప్పుడూ చూడని విధంగా డిమాండ్ నెలకొంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఎనిమిది థియేటర్స్‌కి గాను మొత్తం 4286 టికెట్లు అమ్ముడైపోయాయి. దాంతో కేవలం ప్రీమియర్స్ ద్వారానే 42,64,770 రూపాయల కలెక్షన్ వచ్చింది అని యాజమాన్యం ప్రకటించింది. విజయవాడలో ఇంతవరకు ఎప్పుడూ జరగని రీతిలో ఒక్క రోజు, ఒక్క ప్రీమియర్‌తోనే ఇంత భారీ మొత్తాన్ని వసూలు చేయడం నిజంగా చరిత్ర సృష్టించడమే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

అంతేకాదు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు కలుపుకొని మొత్తం 44 ప్రీమియర్ షోలు ప్లాన్ చేశారు. వీటి ద్వారా కేవలం ప్రీమియర్‌ల ద్వారానే 1.70 కోట్ల గ్రాస్ రాబడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది నిజంగా అద్భుతమైన విషయమే కాకుండా, పవన్ కళ్యాణ్‌కు ఉన్న ఫాలోయింగ్, ఆయన సినిమాపై జనాల్లోని ఆసక్తి ఎలాంటి స్థాయిలో ఉందో నిరూపించే సాక్ష్యం.


ఇక ఈ ప్రీమియర్‌లే ఇంతటి రికార్డు సృష్టిస్తే, రేపటి నుండి మొదలయ్యే రెగ్యులర్ షోస్‌లో ఏ స్థాయి కలెక్షన్స్ వర్షం కురవబోతోందో ఊహించుకోవడం కూడా కష్టమే. ఒక మాటలో చెప్పాలంటే, ఓఘ్ రిలీజ్ కాకముందే సెన్సేషన్ క్రియేట్ చేసింది. రిలీజ్ అయిన తర్వాత బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిస్టరీని రాసుకుంటుందో అన్నది చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: