ఓ జి సినిమా కోసం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు చూపిస్తున్న పిచ్చి స్థాయి ప్యాషన్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ అంతా హాట్ టాపిక్‌గా మారింది. సాధారణంగా ఒక సినిమా చూడడానికి అభిమానులు థియేటర్‌కి వెళ్లేటప్పుడు స్పెషల్ డ్రెస్సులు వేసుకోవడం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు కొత్తగా ఒక ట్రెండ్‌ను మొదలు పెట్టారు. "ఓ జి" సినిమా చూడడానికి తప్పనిసరిగా బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్‌ఫిట్ ధరించాలి అని వారు ఒక కొత్త రూల్‌లా పెట్టుకున్నారు.

ఇది థియేటర్ యాజమాన్యం లేదా మూవీ మేకర్స్ పెట్టిన కండిషన్ కాదు. పవన్ కళ్యాణ్‌కి ఉన్న అపారమైన అభిమానమే ఈ నిర్ణయానికి కారణం. ఆయన "ఓ జి" సినిమాలో ఎక్కువగా బ్లాక్ షర్ట్, బ్లాక్ పాంట్ లాంటి డ్రెస్‌లోనే కనిపించబోతున్నారు. ఆ లుక్‌లో పవన్‌ని చూసినప్పుడు వచ్చే ఫీలింగ్‌ని రెట్టింపు స్థాయిలో అనుభవించాలంటే మనమంతా కూడా బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకొని థియేటర్‌లోకి వెళ్దాం అనే కాన్సెప్ట్‌తో అభిమానులు ముందుకు వచ్చారు.సోషల్ మీడియాలో ఈ ఐడియా ఒక్కసారిగా వైరల్ అవ్వడంతో, ఇప్పుడు "ఓ జి" సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షో చూసే ఫ్యాన్స్ అందరూ బ్లాక్ అవుట్‌ఫిట్ వేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌కి ఉన్న పిచ్చి అభిమానం ఎంత వరకు వెళ్ళగలదో ఇది మళ్లీ ఒకసారి నిరూపించింది.

ఇక సుజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో "సాహో" లాంటి హై లెవెల్ అడ్వెంచర్‌గా తెరకెక్కించబడింది. సుజిత్ అంటేనే గన్ కల్చర్, స్టైలిష్ యాక్షన్, హై వోల్టేజ్ ఎమోషన్స్ గుర్తుకొస్తాయి. అలాంటి స్టైల్‌లో పవన్ కళ్యాణ్ లాంటి స్టార్‌ని చూడటం అభిమానులకు మరింత ఎగ్జయిట్‌మెంట్ కలిగించే విషయం. ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్‌లో చూసిన ప్రతి మూమెంట్ కూడా ఇప్పుడు ఫ్యాన్స్ మెదళ్లలో రివైండ్ అవుతూనే ఉన్నాయి.మొత్తం మీద "ఓ జి" సినిమా రిలీజ్ టైం దగ్గరపడుతున్న కొద్దీ, పవన్ కళ్యాణ్ అభిమానుల ఉత్సాహం హద్దులు దాటుతోంది. సినిమా చూస్తూ ఉండగానే ఆన్ స్క్రీన్‌లో పవన్ బ్లాక్ లుక్‌లో దర్శనమిస్తే, ఆఫ్ స్క్రీన్‌లో ఫ్యాన్స్ కూడా బ్లాక్ అండ్ బ్లాక్ లుక్‌లో ఉండడం—అదొక మరిచిపోలేని అనుభవం అవుతుందని అభిమానులు నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: