
టాలీవుడ్‌లో యంగ్ హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నవీన్ పోలిశెట్టి నటిస్తున్న తాజా చిత్రం “అనగనగా ఒక రాజు”. ఈ సినిమాకి సంబంధించిన స్పెషల్ ప్రమోషనల్ కంటెంట్, క్రీమ్స్, వీడియోలు ఇప్పుడు “ఓ జి” ప్రీమియర్ మరియు ఫస్ట్ డే షోలలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్రం బృందం స్పష్టంగా ప్రకటించింది. కొన్ని రోజుల క్రితం ఈ వార్తలు బయటకు వచ్చినప్పుడు అభిమానులు దీనిని కేవలం ఫేక్ అని కొట్టి పారేసారు. కానీ ఇప్పుడు అధికారికంగా క్లారిటీ రావడంతో నవీన్ పోలిశెట్టి అభిమానులతో పాటు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఫుల్ ఎక్సైట్మెంట్‌లో ఉన్నారు.
ఇక మరోవైపు, “ఓ జి” గురించి చెప్పుకోవాలి అంటే, సినిమా విడుదలకు ముందే 60 కోట్లకు పైగా అడ్వాన్స్ బుకింగ్స్ సాధించడం అంటే నిజంగా చరిత్రలో నిలిచే విషయం. పవన్ కళ్యాణ్ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో, ఆయన ఫ్యాన్స్ ఎంత ఎగ్జైట్‌మెంట్‌తో ముందుగానే థియేటర్ల కోసం వెయిట్ చేస్తున్నారు అనేది ఈ ఒక విషయంతోనే అర్థమవుతుంది. అలాంటి క్రేజ్‌ను ఉపయోగించుకోవాలని “అనగనగా ఒక రాజు” మూవీ టీమ్ స్ట్రాటజీ వేసుకుంది. అందుకే, పవన్ కళ్యాణ్ సినిమా చూసేందుకు వచ్చే ప్రేక్షకులందరికీ ఒకేసారి తమ సినిమా ప్రమోషన్ కూడా చేరాలనే ఉద్దేశ్యంతో, “ఓ జి” థియేటర్లలోనే తమ గ్మిల్ప్స్ విడుదల చేయడానికి సిద్ధమైంది. ఇలా చేయడం వలన, పవన్ ఫ్యాన్స్ చేసే హంగామా మధ్యలోనే నవీన్ పోలిశెట్టి మూవీకి కూడా మంచి పబ్లిసిటీ దక్కుతుంది. దీనితో ఆ సినిమా బజ్ మరింత పెరిగి భారీ ప్రమోషన్‌గా మారుతుందని ఫిల్మ్ నగర్ టాక్.
ఇప్పటికే థియేటర్ల వద్ద పవన్ అభిమానులు భారీ కటౌట్లు, పూలదండలు, పాలాభిషేకాలు, ఫ్లెక్సీలు, డీజే సౌండ్‌తో రచ్చ రంబోలా చేస్తున్నారు. ఫస్ట్ షో పడకముందే పండగ వాతావరణం నెలకొంది. ఇక సినిమా మొదటి షో స్టార్ట్ అవగానే అభిమానులు చేసే వేడుకలు, హంగామా, సంబరాలు మరింత భారీ స్థాయిలో ఉండబోతున్నాయి. మొత్తానికి, “ఓ జి” రిలీజ్‌తో పాటు “అనగనగా ఒక రాజు” టీమ్ వేసిన ఈ ప్రోమోషనల్ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుతుందో చూడాలి. కానీ ఒకటి మాత్రం ఖాయం – పవన్ కళ్యాణ్ సినిమాకి సంబంధించిన ఫస్ట్ షో పడగానే అభిమానులు చేసే హంగామా మాత్రం మామూలు స్థాయిలో ఉండదు, అది మళ్లీ టాలీవుడ్‌లో కొత్త రికార్డులకే దారి తీస్తుంది.