ఓజి సినిమా విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో ఒక మెగా హీరో పేరు బాగా హాట్ టాపిక్‌గా మారింది. ఆయన మరెవరో కాదు, మెగా ఫ్యామిలీకి చెందిన స్టార్ హీరో వరుణ్ తేజ్. వరుణ్ తేజ్ ఎప్పుడూ ఢిఫరేంట్ కథలు, కొత్త జానర్స్‌ని ప్రయత్నిస్తూ తనకంటూ ప్రత్యేకమైన మార్క్‌ క్రియేట్‌ చేసుకున్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు “ఓజి” విజయంతో ఆయన పేరు ట్రోలింగ్‌కు గురవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. నిజానికి, దర్శకుడు సుజిత్ ఓజి సినిమా చేయడానికి ముందు వరుణ్ తేజ్‌తో ఒక సినిమా చేయాలని ప్లాన్‌ చేశాడట. అంతేకాదు, ఆయనను ఇంటికి పిలిపించి పూర్తి కథ కూడా వినిపించాడని సమాచారం. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ప్రాజెక్ట్‌ వరుణ్ తేజ్ చేయకపోవడంతో అది అలా ఆగిపోయింది. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో కూడా ఒప్పుకున్నాడు. ఆ తర్వాత అదే కథ ఆధారంగా సుజిత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఓజి మూవీని తెరకెక్కించాడు. ఇక ఇప్పుడు ఆ సినిమా ఏ రేంజ్‌లో ఆడియెన్స్‌కి కనెక్ట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. థియేటర్స్ ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్ ఎంట్రీలకు, స్టైల్‌కు, డైలాగ్స్‌కి అభిమానులు ఫుల్‌గా రియాక్ట్ అవుతున్నారు.


ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సన్నివేశాలు కూడా ఉన్నాయి.

*పవన్ కళ్యాణ్ ఎంట్రీస్ ఫస్ట్ హాఫ్‌లోనే ఫ్యాన్స్‌ని థియేటర్స్ కుదిపేశాయి.

*ఇంటర్వెల్ బ్లాక్ పవన్ మార్క్ మాస్ ఎలివేషన్‌తో బలంగా నిలిచింది.

*సెకండ్ హాఫ్‌లో పోలీస్ సీన్ హైలైట్‌గా మారి ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగించింది.

*ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే, సినిమా మొత్తానికి కీ పాయింట్‌గా, ఎమోషనల్‌గా నిలిచి థియేటర్‌లో కూర్చున్న ప్రతీ ఒక్కరినీ గూస్‌బంప్స్‌కు గురి చేసింది.

ఈ స్థాయిలో హిట్ అయిన సినిమా ని డైరెక్ట్ చేసిన దర్శకుడికి వరుణ్ తేజ్‌ నో చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఫ్యాన్స్, నెటిజన్లు “మెగా హీరోకి దక్కాల్సిన ఆపర్చునిటీ పవర్ స్టార్‌కి దక్కింది.. అదృష్టం అంటే ఇదే” అంటూ ట్రోలింగ్, మీమ్స్‌తో రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా, సుజిత్‌కి కూడా ఈ సినిమా ఒక లైఫ్ చేంజింగ్ ప్రాజెక్ట్ అయిపోయింది. ఇప్పటివరకు ఒక్కోసారి విమర్శలు ఎదుర్కొన్న ఆయన, ఓజితో బాక్సాఫీస్‌ని షేక్ చేస్తూ ఇండస్ట్రీలో తన స్థాయిని మరో లెవెల్‌కి తీసుకెళ్లాడు. చాలా మంది ఆయనను రాజమౌళి, ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్స్ పక్కన కూర్చునే స్థాయికి ఎదిగాడని పొగడ్తలు కురిపిస్తున్నారు. మొత్తానికి, ఓజి సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి ఒక ఫుల్ ప్యాకేజీ ట్రీట్ అయింది. చూసిన వాళ్లు మళ్ళీ మళ్ళీ థియేటర్స్‌కి వెళ్లి అదే ఎమోషన్‌ని రిపీట్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే #OG, #Powerstar, #MassClimax లాంటి హ్యాష్‌ట్యాగ్స్ హీట్‌ పెంచేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: