పవన్ కళ్యాణ్..ఈయన ఇండస్ట్రీలోనే ఒక బ్రాండ్.. తాను ఏదైనా సాధించాలనుకుంటే కష్టమైనా, నష్టమైనా సాధన దిశగానే వెళ్తారు తప్ప వెనక్కి తగ్గరు. అది సినిమా అయినా సరే రాజకీయాల్లో అయినా సరే.. ఆ విధంగా పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి పేరుతో ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చినా కానీ  తనకంటూ ప్రత్యేకమైనటువంటి గుర్తింపును సాధించారు. అలాంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో ఎక్కువగా నమ్మే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్.. పవన్ కళ్యాణ్ కు ఈ డైరెక్టర్ కు మధ్య మంచి బాండింగ్ ఉంది.. ఆయన ఏ సినిమా చేసినా త్రివిక్రమ్ కు చెబుతారు. ఆయన కూడా ఆ సినిమా కథ అంతా విని అందులో మార్పులు,చేర్పులకు సంబంధించి సలహాలు కూడా ఇస్తూ ఉంటారు.

 ఇలా పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు తీసిన ప్రతి సినిమా వెనుక త్రివిక్రమైతే ఉన్నారు. అయితే తాజాగా వచ్చిన ఓజి చిత్రానికి సంబంధించి త్రివిక్రమ్ చాలా దూరంగా ఉన్నారట. కారణం ఏంటి అనే వివరాలు చూద్దాం.. పవన్ హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా వస్తున్న ఈ చిత్రానికి యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాంటి ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 25న రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇదిలా నడుస్తున్న సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా వస్తుందంటే చాలు  ప్రమోషన్ కార్యక్రమాల్లో త్రివిక్రమ్ పాల్గొంటారు.

కానీ ఈసారి ఓజి సినిమాకి సంబంధించి ఆయన ఎక్కడా కనిపించలేదు. సినిమా సుజిత్ తో చేస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ కి సజెషన్ ఇచ్చి వెళ్లారు తప్ప ప్రమోషన్ కార్యక్రమాలకు ఆయన రాలేదట. దీనికి కారణం కూడా ఉందని సోషల్ మీడియాలో ఒక వార్త హైలైట్ అవుతోంది. ఆ మధ్య రిలీజ్ అయిన హర హర వీరమల్లు సినిమాకు సంబంధించి  త్రివిక్రమ్ వేలు పెట్టడం వల్లే ఫ్లాప్ అయిందని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. అందుకే ఓజి సినిమాకు సంబంధించి ఆయన దూరం దూరంగానే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమా పాజిటివ్ టాక్ అందుకోవడంతో సక్సెస్ మీట్ కి హాజరవుతారని సమాచారం అందుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: