ఒక సినిమా థియేటర్లలో రిలీజ్ అయిన తర్వాత దానికి సంబంధించిన రివ్యూలు చాలా కీలక పాత్ర పోషిస్తాయి. ప్రతిసారీ సినిమాల విషయంలో రివ్యూలు ఒక పెద్ద తలనొప్పిలా మారుతూనే ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది ప్రేక్షకులు రివ్యూలను చదివి థియేటర్‌కి వెళ్లాలా వద్దా అన్నది డిసైడ్ చేస్తుంటారు. ఈ కారణంగానే కొందరు రివ్యూలను పూర్తిగా బ్యాన్ చేయాలని, రివ్యూలు వ్రాయడం ఆపేయాలని కూడా సూచించారు. ఎందుకంటే నెగిటివ్ రివ్యూల వల్లే చాలా మంది థియేటర్స్ కి రాకుండా మానేస్తున్నారని వారి అభిప్రాయం.


అయితే, పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన “ఓజీ” విషయంలో మాత్రం ఈ సీన్ పూర్తిగా తలకిందులైంది. ఈ సినిమాకి సంబంధించి రివ్యూవర్స్ ఏమి రాసినా, ఎంత నెగిటివ్‌గా రాసినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి అసలు పట్టడం లేదు. “రివ్యూలు చదవాల్సిన అవసరం లేదు, పవన్ కళ్యాణ్ సినిమా అంటే అది ఖచ్చితంగా థియేటర్లోనే చూడాలి” అని ఫ్యాన్స్ నినదిస్తున్నారు. నిజానికి రివ్యూలను చూడకుండానే ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని థియేటర్లలో వెయిట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మచ్ అవైటెడ్ బిగ్ ప్రాజెక్ట్ కొద్దిసేపటి క్రితమే థియేటర్లలో రిలీజ్ అయ్యింది. రిలీజ్ అయిన వెంటనే ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానుల హృదయాలను పిచ్చి పిచ్చిగా ఆకర్షించింది. ఎంతలా అంటే, ఈ సినిమా చూసిన తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నరనరాల్లోకి ఓజీ సినిమా ఎక్కేసినట్టే
 అనిపిస్తోంది. థియేటర్లలో సినిమా అయిపోగానే బయటకు వచ్చే సమయంలో ఫ్యాన్స్ అంతా “ఓజీ.. ఓజీ.. జై పవన్ కళ్యాణ్” అంటూ కేకలు వేస్తూ రచ్చ రంబోలా చేస్తున్నారు.


“ఇది మా పవన్ కళ్యాణ్.. ఇదే నిజమైన పవర్‌స్టార్” అంటూ సందడి చేస్తున్నారు. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ లోని టాలెంట్‌ను బయటకు తీయడంలో సుజిత్ అద్భుతంగా పనిచేశాడని ఫ్యాన్స్ కృతజ్ఞతలు తెలుపుతున్నారు. “థాంక్యూ సుజిత్” అంటూ సోషల్ మీడియాలో పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.అ యితే మరోవైపు, రివ్యూలు రాసే ప్రతి ఒక్కరు కూడా సినిమాలోని పాజిటివ్ పాయింట్స్ ఎంతగా హైలైట్ చేశారో, నెగిటివ్ పాయింట్స్ కూడా అదే రీతిలో రాశారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, అందరూ ఒకే నెగిటివ్ పాయింట్‌నే హైలైట్ చేస్తున్నారు. అదేంటంటే – “ఈ సినిమాలో పెద్దగా కథ లేదు” అనే మాట.



రివ్యూలలో అందరూ ఒకేలా రాసిన విషయం ఏమిటంటే – “ఈ సినిమా మొత్తానికి కర్త, కర్మ, క్రియ అన్నీ పవన్ కళ్యాణ్ ఒక్కరే. ఒక వన్ మ్యాన్ ఆర్మీలా పవన్ కళ్యాణ్ ఈ సినిమాను తన భుజస్కంధాల మీద మోసుకెళ్లాడు” అని. కథ లేకపోయినా తన మేనరిజం, స్టైల్, పవర్‌ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో కథను ముందుకు నడిపించాడు అని చెబుతున్నారు.డైరెక్టర్ సుజిత్ కూడా ఈ సినిమాలో కథ లేదన్న ఆలోచన ప్రేక్షకులకు రాకుండా జాగ్రత్తగా వర్క్ చేశాడు. అయితే ఫ్యాన్స్‌ని ఎలా చూడాలి అనుకున్నారు, ఎలా మెప్పించాలి అనుకున్నారు – దానిపై ఎక్కువ ఫోకస్ పెట్టడం వలన అసలు కథనే మిస్ చేశాడన్న కామెంట్ కూడా వినిపిస్తోంది.



అయినా సరే, రివ్యూలు ఎంత నెగిటివ్‌గా రాసినా, పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఒక్క మాట మీదే నిలబడ్డారు. “పవన్ నటించిన ఓజీ సినిమా బ్లాక్‌బస్టర్.. నో డౌట్. ఈ సినిమా చరిత్ర సృష్టించబోతుంది” అని గట్టిగా చెబుతున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అంతా ఒకే స్వరం వినిపిస్తున్నారు – “జై పవన్ కళ్యాణ్. థియేటర్‌లో చూసే అనుభవమే వేరే లెవెల్.. అందరూ తప్పక చూడాలి” అంటూ ఓజీని ప్రమోట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: