
ప్రత్యేకంగా హైదరాబాదులోని విమల్ థియేటర్లో, దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు మెగా ఫ్యామిలీ సభ్యులు కూడా సినిమా చూసి ఎంజాయ్ చేశారు. అదేవిధంగా, పవన్ కళ్యాణ్ కుమారుడు అఖీరానందన్ మరియు కుమార్తె కూడా థియేటర్‌లో సినిమా చూసి ఖుషి అయ్యారు. వారు సీక్రెట్‌గా వచ్చినప్పటికీ, అక్కడ ఫ్యాన్స్ గుర్తించడంతో కొంత సమయం హడావిడి వాతావరణం నెలకొన్నప్పటికీ, ఆ తర్వాత అభిమానుల మధ్య కూర్చొని సినిమాను పూర్తి ఆసక్తితో చూసారు.సినిమాలో పవన్ కళ్యాణ్ ఎంట్రీలు వచ్చినప్పుడు, ఫ్యాన్స్ విజిల్స్ వేస్తూ, అరుస్తూ, తప్పట్లు కొడుతూ, సినిమా అనుభవాన్ని మరింత ఉత్సాహవంతంగా మార్చారు. అలాంటి సందర్భాల్లో అఖీరానందన్ ఫుల్‌గా ఆనందించడమే కాకుండా, చాలా సైలెంట్‌గా ఉండే ఆయన, ఈ సినిమా థియేటర్‌లో చూస్తూ పూర్తిగా ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన పిక్చర్స్ ఇప్పుడే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అదేవిధంగా, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడని వారు తక్కువే, ఆయన మ్యాజిక్ అన్ని వర్గాలపై పనిచేస్తుందని అభిమానులు నిరూపిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోలు, ఫోటోలు వైరల్‌గా మారుతూ, అభిమానులు అఖీరానందన్‌ని ప్రత్యేకంగా పొగడ్తుతున్నారు. గతంలో, అమితాబ్ బచ్చన్ సినిమా రిలీజ్ టైంలో కూడా పవన్ కళ్యాణ్ ఇలాగే చేసేవాడట. ఆయన స్వయంగా చెప్పిన విషయం ఇది. ఇప్పుడు అదే విధంగా అఖీరా కూడా చేశాడు. దీంతో మెగా బ్లడ్ ఇది..ఎక్కడికిపోతుంది అంటూ బాగా అఖీరా ని పొగిడేస్తున్నారు..!