బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన వ్యాఖ్యలపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలకృష్ణ అసెంబ్లీలో అందరి ముందే కాస్త వ్యంగ్యంగా చిరంజీవి గురించి మాట్లాడడం ఆయనకు ఏమాత్రం నచ్చలేదు. ఆయనకు మాత్రమే కాదు మెగా ఫ్యాన్స్ కూడా బాలకృష్ణ మాట్లాడిన తీరు చూసి మండిపడిపోయారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి ఒక పత్రిక ప్రకటన ద్వారా తన కౌంటర్ ఇచ్చారు. ఇందులో బాలకృష్ణ మాట్లాడిన వ్యాఖ్యలపై స్పందిస్తూ బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడిన తీరు నాపై వ్యంగ్యంగా మాట్లాడడం నేను టీవీలో చూశాను. నన్ను జగన్ సాదరంగానే ఆహ్వానించారు. అలాగే ఆరోజు బాలకృష్ణను కూడా రమ్మని ఆహ్వానించాం.కానీ ఆయన అందుబాటులో లేరు. దాదాపు మూడుసార్లు ఆయనతో ఫోన్లో మాట్లాడి రమ్మని పిలుద్దాం అనుకున్నాం. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు.

 అలాగే జగన్మోహన్ రెడ్డి ఇంటికి సాదరంగా లంచ్ కి ఆహ్వానించారు.భోజనం చేసుకుంటూ సినీ ఇండస్ట్రీ ఇబ్బందుల గురించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత అప్పటి సినిమాటోగ్రాఫర్ మంత్రి పేర్ని నాని కాల్ చేసి జగన్ గారిని కలవడానికి అనుమతి ఇచ్చారు. కానీ కరోనా కారణంగా ఐదుగురిని మాత్రమే రమ్మన్నారు. అయితే మేం పదిమంది వస్తామని చెప్పాము. ఆరోజు ఎన్నో విషయాలను చర్చించాము. సినీ ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చర్చించాము. నేను ముందు పడి ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లే అప్పటి సినిమాలకు టికెట్ రేట్లు పెరిగాయి.మీ వీరసింహారెడ్డి, నా వాల్తేరు వీరయ్య మూవీకి టికెట్ రేట్లు పెరగడానికి కారణం ఈ చర్చనే...

ఈ నిర్ణయం తీసుకోవడంతో సినీ పరిశ్రమకు కొంతైనా మేలు కలిగింది.. టికెట్ రేట్లు పెంచడం వల్ల డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభాలు వచ్చాయి.నేను సామాన్యుడైన ముఖ్యమంత్రితోనైనా సరే నా సహజ సిద్ధమైన ధోరణితోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునేలా మాట్లాడతాను అంటూ చిరంజీవి బాలకృష్ణకు మాస్ కౌంటర్ ఇచ్చారు.అలా ఒక విధంగా గౌరవం ఇస్తేనే మళ్లీ తిరిగి నేను కూడా గౌరవం ఇస్తాను అనే విధంగా బాలకృష్ణకు చురకలు అంటించారు. అంతేకాదు నేను ముందు పడడం వల్లే మీ సినిమాకి టికెట్ రేట్లు పెంచారు. అందుకే మీ సినిమా హిట్ అయింది అని పరోక్షంగా చిరంజీవి మాట్లాడారు. అలా చిరంజీవి విడుదల చేసిన పత్రికా ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఏది ఏమైనప్పటికి బాలకృష్ణ మాట్లాడిన మాటలకు చిరంజీవి గట్టి కౌంటర్ ఇచ్చారని మెగా ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: