ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల సినిమాలకు ఒక రోజు ముందు బెనిఫిట్ షో లను పెద్ద ఎత్తున ప్రదర్శిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఇకపోతే ఈ బెనిఫిట్ షో ల పద్ధతి అనేది ఇప్పుడు మొదలైంది కాదు. చాలా కాలం క్రితమే తెలుగు సినీ పరిశ్రమలో మొదలు అయింది. చాలా సంవత్సరాల క్రితం ఒక ఏరియాలో ఒక హీరోకు సంబంధించిన అభిమానులకు ఆ ఏరియాలో అక్కడ ఉన్న జనాలను బట్టి బెనిఫిట్ షో కు థియేటర్లను కేటాయించేవారు. ఆ థియేటర్ కి సంబంధించిన టికెట్లను ఆ హీరో అభిమానులు వారికి నచ్చిన వారికి పంచేవారు.

ఇలా కొంత కాలం కొనసాగింది. దానితో కోర్టు ఆ విషయాన్ని తప్పు పట్టింది. బెనిఫిట్ షో లు అనేవి ఎవరికైనా ప్రయోజనం చెందడం కోసం ఉండాలి అనే ప్రతిపాదనను తీసుకు వచ్చింది. దానితో ఏదైనా ట్రస్ట్ లేదా అనాధ ఆశ్రమం ఇలా ఏదైనా ఒక దానికి బెనిఫిట్ చేయడం కోసం బెనిఫిట్ షో లను ప్రదర్శించాలి అనే ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చారు. కానీ అందులో కూడా కొన్ని అవకతవకలు జరగడంతో బెనిఫిట్ షో లపై పలు నిబంధనలు వచ్చాయి. కానీ ప్రస్తుతం మాత్రం బెనిఫిట్ షో ల పేరుతో పెద్ద ఎత్తున డబ్బులు రాబడుతున్నారు.

ఈ మధ్య కాలంలో ఎవరైనా స్టార్ హీరో నటించిన సినిమాలకి భారీ క్రేజ్ ఉన్నట్లయితే ఆ మూవీలకు పెద్ద ఎత్తున బెనిఫిట్ షో లను ప్రదర్శిస్తున్నారు. దానికి ఇష్టం వచ్చిన ధరలను ఫిక్స్ చేస్తూ వెళుతున్నారు. ఇక ఆ హీరోకు ఉన్న క్రేజ్ , ఆ సినిమాకు ఉన్న క్రేజ్ తో బెన్ఫిట్ షోల ద్వారా కూడా పెద్ద ఎత్తున డబ్బులు వస్తున్నాయి. ఇకపోతే ఈ విషయాన్ని కూడా న్యాయ స్థానాలు తప్పుపడుతున్నాయి. ఎవరికైనా బెనిఫిట్ ఉండడం కోసమే బెనిఫిట్ షో లను ప్రదర్శించాలి. మీకు ఇష్టం వచ్చిన ధరలతో బెనిఫిట్ షో లను ప్రదర్శించకూడదు అనే ప్రతిపాదనను ముందుకు తీసుకు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: