సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక పెద్ద మార్పుని తీసుకొచ్చిందా అంటే అందరూ ఏకకంఠంతో “అవును” అని చెప్పేస్తున్నారు. దీనంతటికీ ప్రధాన కారణం డైరెక్టర్ సుజిత్ - పవన్ కళ్యాణ్‌ను చూపించిన తీరు. ఒక పవన్ కళ్యాణ్ అభిమాని తన అభిమాన హీరోను ఎలా చూడాలనుకుంటాడో, అతని గుండె లోతుల్లో ఏ రకమైన ఇమేజ్‌ని కోరుకుంటాడో—ఆ కోరికకు వంద రెట్లు మించి సుజిత్ తెరపై చూపించారు. ఫలితంగా కోట్లాది పవన్ కళ్యాణ్ అభిమానుల మనసుల్లో ఎన్నాళ్లుగానో ఉన్న కోరిక నెరవేరింది. ఇప్పుడేమిటంటే ఎక్కడ చూసినా “ఓ జి… ఓ జి… ఓ జి…” అనే నామస్మరణే వినిపిస్తోంది. సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు మైమరచిపోయే స్థాయిలో ఉన్నారు. ఇక్కడ హైలెట్ ఏమిటంటే—ఇప్పటివరకు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించిన వారు కూడా ఈసారి ఓజీ సినిమాను చూసి పొగడక తప్పడం లేదు. ఇది ఒక్కటే చాలు సుజిత్ -పవన్ కళ్యాణ్ మేనరిజాన్ని అభిమానుల నరనరాల్లోకి ఎలా దింపారో అర్థం చేసుకోవడానికి.


సినిమా చూసిన తర్వాత టాలీవుడ్‌లోని చాలా మంది పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నారని సోషల్ మీడియాలో వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటివరకు చాలామంది స్టార్ హీరోలు, పెద్ద మేకర్స్ సినిమాకు డైరెక్షన్ కంటే ప్రమోషన్స్‌పైనే ఎక్కువ శ్రద్ధ చూపించేవారు. కానీ ఓజీ సినిమా ఒక గట్టి గుణపాఠం నేర్పింది. ఎందుకంటే ఈ సినిమాకు అసలు ప్రమోషన్ చేయలేదు అనుకోవచ్చు. పవన్ కళ్యాణ్ తన రాజకీయ, వ్యక్తిగత బాధ్యతలతో బిజీగా ఉండగా, మిగతా స్టార్స్ కూడా చాలా తక్కువగా మాత్రమే కనిపించారు. అయినప్పటికీ, అది సినిమాకి పెద్ద ప్లస్ కాలేదు. ప్రజలు థియేటర్లకు రావడానికి కారణం ఒక్కటే—పవన్ కళ్యాణ్ మేనరిజం.



ఈ సంఘటనతో టాలీవుడ్ సినీ పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారట. ఇకపై సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ నిర్వహించకపోయినా పర్వాలేదు. ఒక అభిమాని తన ఫేవరెట్ హీరోను ఎలా చూడాలి అనుకుంటాడో, అతని మనసులో ఏ ఎలిమెంట్ కావాలో—అది సినిమాలో ఉంటే చాలు. అదే సినిమాకి బలమైన ప్రచారంగా మారుతుంది. ఇప్పుడు ఈ ఆలోచన ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశమైంది. అయితే ప్రతి సినిమా విషయంలో ఇది వర్కౌట్ అవుతుందా..? అన్నది మరో పెద్ద ప్రశ్న. ఎందుకంటే అన్ని సినిమాలు ఒకేలా ఉండవు, అన్ని హీరోలకు పవన్ కళ్యాణ్‌లా ఓవర్‌ఆల్ క్రేజ్ ఉండదు. ఈ ట్రెండ్ అన్ని సినిమాలకు వర్కౌట్ అవుతుందా? లేక కేవలం కొందరి సినిమాలకు మాత్రమేనా? అనే విషయంపై మిగతా సినీ ప్రముఖులు కొంత సందేహం వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి… ఈ విషయంలో ఫైనల్ కన్క్లూజన్ ఏ విధంగా ఉండబోతుందో. కానీ ఒక విషయం మాత్రం స్పష్టమే—ఓజి  సినిమా టాలీవుడ్ పెద్దలకు ఒక కొత్త దారి చూపించింది, “ప్రచారంకన్నా కంటెంట్, హీరో మేనరిజమే ముఖ్యం” అని బలంగా గుర్తు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: