
కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు తమ వ్యక్తిగత ఎజెండాలతో పలు రకాల వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూ ఉండడంవల్ల ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలా వ్యవహరిస్తున్నారని ఇలా ఇష్టానుసారంగా మాట్లాడడంపై చంద్రబాబు ఆగ్రహాన్ని తెలుపుతున్నారు. నిన్నటి రోజున కొంతమంది మంత్రుల దగ్గర అసెంబ్లీ శాసనసభలో జరిగిన విషయాలపైన చంద్రబాబు ప్రస్తావన తీసుకువస్తూ ఫైర్ అయ్యారు. ముఖ్యంగా రవికుమార్, gopala krishna REDDY' target='_blank' title='బొజ్జల-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>బొజ్జల సుధీర్ రెడ్డి పైన కూడా ఆగ్రహాన్ని తెలియజేశారు. అసలు అసెంబ్లీ సమావేశాలలో ఏం మాట్లాడాలో, ఎలాంటి విషయాలు మాట్లాడాలో తెలియదా? అంటూ క్లాస్ పీకారు. సభ్యులు ఇలా వ్యవహరిస్తుంటే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా వాటిని నియంత్రించాల్సిన పల్లా శ్రీనివాస్ కూడా ఆ పని చేయకపోవడంతో గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలిసింది.
ముఖ్యంగా కూటమి ప్రభుత్వం శాంతి భద్రత విషయంలో ప్రభుత్వానికి చేతకావడం లేదంటూ కొంతమంది సీనియర్ సభ్యులు కూడా వ్యాఖ్యానించడంతో సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. కొంతమంది ఎమ్మెల్యేలు కూడా గీత దాటి మాట్లాడుతున్నారని ఇది అసలు అసెంబ్లీ అనుకుంటున్నారా! లేకపోతే పార్టీ సమావేశం అనుకుంటున్నారా! అంటూ ఫైర్ అయ్యారు. ఎంతో సీనియారిటీ ఉన్న సభ్యులు కూడా గీత దాటి వ్యవహరిస్తూ ఉండడంతో సీఎం తీవ్ర అగ్రహాన్ని తెలియజేశారు.
శాసనసభలో ప్రతిపక్షం లేకపోయినా మీరే ప్రతిపక్షం కంటే చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని సభలో ఎవరెవరు ఏమేం మాట్లాడారనే విషయం నా దగ్గర ఉన్నాయంటూ హెచ్చరించారు. తాను ప్రతిరోజు 15 గంటల పాటు రాష్ట్ర అభివృద్ధికే కష్టపడుతున్నానని.. కానీ మీరు మాత్రం బాధ్యత లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారని హెచ్చరించారు. ఇలా తప్పులు చేసుకుంటూ పోతే వైసిపి పార్టీ వాళ్లకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది. వారు చేసిన విధ్వంసం వల్లే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారంటు ఎమ్మెల్యేలకు గట్టి క్లాస్ పీకారు సీఎం చంద్రబాబు. కచ్చితంగా ఇకమీదట పార్టీ ఎమ్మెల్యేలు క్రమశిక్షణతోనే ఉండాలని గీతా దాటితే సహించమంటూ హెచ్చరించారు. అలాగే మరికొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు శాసనసభకు ఆలస్యంగా రావడం ,ముందుగానే వెళ్లడం వంటి విషయాల పైన కూడా ఆగ్రహాన్ని తెలిపారు.