సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు చేసే పనిని నిజంగానే అనుసరించే వాళ్లు చాలామంది ఉంటారు. తమ అభిమాన హీరో ఏది చెప్తే అది చేసే వాళ్లు, తమ అభిమాన హీరో సినిమాలో ఏ పని చేస్తే రియల్ లైఫ్‌లో అదే పని చేసే వాళ్లను మనం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే కొంతమంది హీరోలు దాన్ని బేస్ చేసుకుని తమ సినిమాల్లో మెసేజ్ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ ఎక్కువగా చూపిస్తుంటే, మరికొందరు మాత్రం అలాంటివి మరిచిపోయి, డబ్బులు ఏ సినిమా కోసం ఎక్కువ ఇస్తే ఆ సినిమానే చేస్తూ ఉంటారు. వయసుతో సంబంధం లేకుండా తమకంటే చాలా చిన్న వయసున్న హీరోయిన్‌లతో రొమాన్స్ చేస్తూ సినిమాల్లో నటిస్తున్న హీరోల గురించి ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..!!


సల్మాన్ ఖాన్ : బాలీవుడ్ ఇండస్ట్రీలో కండలవీరుడిగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఆయన ఏ సినిమాలో నటించినా అది హిట్ అవుతుంది. రీసెంట్‌గా ఆయన సికిందర్ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన్నాతో రొమాన్స్ చేశారు. ఈ విషయంలో పలు విమర్శలు వచ్చాయి. రష్మిక తండ్రి వయసున్న సల్మాన్ ఖాన్‌తో ఆమె రొమాన్స్ చేయడం ట్రోలింగ్‌కు దారి తీసింది. దీనిపై "వయసుతో పనేముంది?" అంటూ సల్మాన్ ఎదురు ప్రశ్నలు వేశారు. అయినా కూడా ట్రోల్స్ ఆగలేదు. పాత హీరోయిన్స్‌తో నటిస్తే తమ స్టార్డమ్ తగ్గిపోతుందని భావించే హీరోలు, యంగ్ హీరోయిన్స్‌తోనే రొమాన్స్ చేస్తున్నారు అని విమర్శలు వచ్చాయి. సల్మాన్-రష్మిక జంటను చూసి బాలీవుడ్ అంతా ఆశ్చర్యపోయింది.



అమీర్ ఖాన్ : ఇతగాది గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అసలు తన వయసుకి తాను చేసే సినిమాల్లో నటించే హీరోయిన్‌లకు పెద్దగా సంబంధం ఉండదు. వయసులో చిన్న వాళ్లతో నటించడం పై ప్రశ్నలు వచ్చినప్పుడల్లా "తాను ఎప్పుడూ అలాంటిది చేయలేదు" అని కవర్ చేసుకుంటూ వస్తారు. కానీ కరీనా కపూర్ ఆయనకంటే చిన్నదే. అది మరిచిపోయారో ఏమో. సీనియర్ హీరోయిన్స్‌తో నటిస్తే ఓల్డ్ అయిపోతామని భావించే హీరోలు, అందుకే యంగ్ హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తున్నారు అని ఘాటుగా ట్రోలింగ్ జరుగుతోంది.



కేవలం వీరిద్దరే కాదు, బాలీవుడ్‌లో చాలామంది స్టార్‌లు తమ వయసును మరిచిపోయి, ఇంచుమించు కూతురు వయసున్న హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తూ ఇండస్ట్రీ విధానాలను తప్పు పట్టిస్తున్నారు. అసలు సినిమా ఇండస్ట్రీ అంటే ఎంటర్టైన్మెంట్, మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు. కానీ వాటిని మరిచిపోయి, తమ వ్యక్తిగత ఆస్తులు పెంచుకోవడానికి ఏ సినిమా ఎంత రెమ్యూనరేషన్ ఇస్తే ఆ సినిమాలో ఎటువంటి పాత్రలోనైనా నటించడానికి రెడీ అవుతున్నారు కొందరు స్టార్‌లు. ఇది బాలీవుడ్ ఇండస్ట్రీని త్వరలోనే దెబ్బతీసే స్థాయికి తీసుకువెళ్తుందని చాలా మంది అభిప్రాయం..!!

మరింత సమాచారం తెలుసుకోండి: