టాలీవుడ్‌లో స్టార్ హీరోలు ఏ చిన్న అప్‌డేట్ కూడా సోషల్ మీడియాలో హ‌ట్ టిపిక్ అవుతు ఉంటుంది. తాజాగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ నుంచి రిలీజ్ అయిన లుక్ ఒక్కసారి వైరల్ అయ్యింది. ఫొటోలో రామ్ చరణ్ వేసుకున్న షర్ట్, స్టైల్, అటిట్యూడ్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే నెటిజన్లలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఎందుకంటే, ఈ లుక్ రెండు రోజుల క్రితం ‘ది ప్యారడైజ్’ మూవీలో మోహన్‌బాబు లుక్‌ని పోలి ఉందని వారు కామెంట్ చేస్తున్నారు. షర్ట్ డిజైన్, కలర్, అటిట్యూడ్ కూడా చాలా సమానం. ఇలాంటి పోలికపై అభిమానుల్లో రెండు వైపులుగా అభిప్రాయాలు పడ్డాయి.
 

కొంతమంది పాజిటివ్‌గా చూస్తూ, “మోహన్‌బాబు టాలీవుడ్‌లో లెజెండ్, ఆయన స్టైల్‌ని రామ్ చరణ్ ఫాలో అవడం గర్వకారణం” అని చెబుతున్నారు. మరికొందరు సరదాగా, “పెద్ది నుంచి ప్యారడైజ్ దాకా ఒకే షాపింగ్ మాల్‌లో షర్ట్ కొనుకున్నారేమో?, మన డైరెక్టర్లలో క్రియేటివీ తగ్గిపోతోందేమో” అని కామెంట్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో మెగా, మంచు ఫ్యాన్స్ మధ్య స్టైల్ వార్ ప్రత్యేకంగా ఉంటుంది. చిరంజీవి, మోహన్‌బాబు ఇద్దరూ టాలీవుడ్‌లో తమ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. చిరంజీవి మెగాస్టార్ అయినా డ్యాన్స్, మాస్ అప్పీరియన్స్, స్టైల్ విషయంలో మోహన్‌బాబు స్టైల్, డైలాగ్ డెలివరీకి అగ్రగణ్యుడు.

 

అయితే మోహన్‌బాబు లెజెండ్ స్థాయి ప్రేక్షకుల గుండెల్లో చిరంజీవి క్రేజ్‌తో పోలిస్తే తక్కువ స్థాయిలో ఉంటుంది. రామ్ చరణ్ ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోగా, గ్లోబల్ క్రేజ్‌తో ఎదిగి మోహన్‌బాబు లుక్‌ని పోల్చిన లుక్‌ రిలీజ్ చేసిన చర్చల్ని మళ్లీ ప్రేరేపించాడు. మెగా, మంచు అభిమానులు ఒకరిపై ఒకరు కౌంటర్ ఇచ్చి హాస్య, స్టైల్ కామెంట్లతో సోషల్ మీడియాలో చర్చ కొనసాగిస్తున్నారు. టాలీవుడ్‌లో స్టైల్ మాత్రమే కాదు, వారసత్వం, అభిమానుల భిన్న అభిప్రాయాలు, లుక్ పోలికలూ సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. రామ్ చరణ్–మోహన్‌బాబు లుక్ పోలికతో ప్రారంభమైన ఈ చర్చ టాలీవుడ్ ఫ్యాన్స్ కి మరో ఫన్ మోడ్ అందించింది. కాస్త సరదా, కాస్త వెర్రి, కానీ ఫ్యాన్స్ కోసం ఇదే టాలీవుడ్ మాస్టర్ ప్లాన్!

మరింత సమాచారం తెలుసుకోండి: