
ఇక ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కలయికలో వస్తున్న భారీ చిత్రంపై కూడా నిర్మాత స్పష్టతనిచ్చారు. “మేము ప్రామిస్ చేసినట్టుగానే ఈ సినిమా అనుకున్న టైంకే వస్తుందన్నారు. కొత్త షెడ్యూల్ వచ్చే నెలలో మొదలవుతుంది. ఈ సినిమా పూర్తిగా వేరే స్థాయిలో ఉండబోతోందని తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ టైటిల్ ‘డ్రాగన్’ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు రవి బ్రసూర్ సంగీతం అందిస్తున్నారు.
దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రత్యేకమైన మాస్ యాక్షన్ ట్రీట్మెంట్‌తో తెరకెక్కించబోతున్న ఈ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘కాంతార చాప్టర్ 1’తో రిషబ్ శెట్టి మరోసారి తన మైమరపించే నటనను చూపించబోతుండగా, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లోని ‘డ్రాగన్’ మాత్రం ఇండియన్ సినిమాకి కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసే అవకాశం ఉన్న సినిమాగా ఇండస్ట్రీ టాక్ వినిపిస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు