
ఒడియన్ మల్టీప్లెక్స్ 2025 అక్టోబర్ 24న ప్రారంభం కానుంది. ఒకప్పుడు సింగిల్ స్క్రీన్‌గా ప్రసిద్ధి చెందిన థియేటర్‌ను ఇప్పుడు ఎనిమిది స్క్రీన్లతో మల్టీప్లెక్స్‌గా అప్ గ్రేడ్ చేస్తున్నారు. ఇందులో ప్రొజెక్షన్ సిస్టమ్, లగ్జరీ సిట్టింగ్, మల్టీ లెవెల్ పార్కింగ్ వంటి ఆధునిక సౌకర్యాలు ఉండబోతున్నాయి. అంతేకాదు, లోపల షాపింగ్ మాల్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాయి. మరో మల్టీప్లెక్స్, ఏఎంబీ క్లాసిక్, 2026 సంక్రాంతి సందర్భంగా ప్రారంభం కానుంది. ఇది సుదర్శన్ 70MM కాంప్లెక్స్ ప్రదేశంలో నిర్మించబడుతుంది. ఇందులో లేటెస్ట్ టెక్నాలజీతో ఏడు కొత్త స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మల్టీప్లెక్స్‌లో తొలి సినిమా ప్రదర్శన మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన రాజా సాబ్ తో చిత్రంతో జరుగబోతోంది.
హైదరాబాదు సినిమా ప్రేమికులకు ఉత్సాహం కలిగే విషయం ఏమిటంటే, సింగిల్ స్క్రీన్‌ల నొస్టాల్జియాతో నిండిన ఈ ప్రాంతం ఇప్పుడు అత్యాధునిక మల్టీప్లెక్స్ సంస్కృతిగా మారింది. లగ్జరీ ఎక్స్పీరియన్స్ అందించడం వల్ల, సినీ ప్రముఖులు కూడా ఈ ప్రాజెక్ట్‌పై గర్వంగా మరియు ఉత్సాహంగా స్పందిస్తున్నారు. అందువల్ల, ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లోని సినిమా థియేటర్ల సంఖ్య ఇప్పుడు 18 నుంచి 20కి పెరుగబోతోంది. ఇది సినీ ప్రియులకు వెరీ బిగ్ గుడ్ న్యూస్ అనే చెప్పాలి..!!