కొరటాల శివ అభిమానులకి ఇది ఒక పెద్ద సర్‌ప్రైజ్ అనే చెప్పాలి. కొరటాల శివ అంటే ఫ్లాప్ అనే పద్ధతి అర్ధం తెలియని  డైరెక్టర్ అని అంత చెప్పుకునే వారు. కానీ ఆచార్య సినిమాకు ముందు వరకు ఈ పేరు ఉండేది. మిర్చి సినిమాతో విశేష ప్రసిద్ధి పొందాడు ఈ కొరటాల శివ. అయితే ఆచార్య సినిమా తర్వాత ఆయనకి ఇంతకుముందు ఉన్న హైప్ పూర్తిగా తగ్గిపోయింది. ఆచార్య ఫ్లాప్‌కి కారణంగా కొరటాల శివ డైరెక్షన్ ని కొంత మంది ట్రోల్ చేశారు.  సినిమాకి మంచి రిస్పాన్స్ రాలేదు అని కొరటాల శివ ఇక డమ్మి అయిపోయాడని చాలా ఘాటుగా ట్రోల్ చేశారు.

అయితే ఈ సినిమా విషయంలో తప్పు ఎవరిది అనేది పక్కన పెడితే..ఈ సినిమా తరువాత కొరటాల శివ పేరుకు వచ్చిన డ్యామేజ్ ఇంక ఎవ్వరికి రాలేదు. ఆ ట్రోల్లింగ్ ని తట్టుకుని ఆ తర్వాత ఎన్టీఆర్ హీరోగా ‘దేవర’ అనే ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేశారు కొరటాల శివ. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ప్రథమ భాగం ఇప్పటికే రిలీజ్ అయ్యింది, రెండో భాగాన్ని త్వరలోనే సెట్స్ పైకి  తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. దీని ద్వారా కొరటాల శివ పేరుకు మళ్లీ పునరుజ్జీవనం వస్తుంది అనేది ఆయన ఫ్యాన్స్ నమ్మకం.

ఇలాంటి మోమెంట్‌లోనే కొరటాల శివకు మరో పెద్ద జాక్పాట్ ఛాన్స్ లభించింది. సినీ ఇండస్ట్రీలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం, ఆయన తన తదుపరి సినిమాను టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణతో చేయబోతున్నారు. ప్రస్తుతానికి బాలకృష్ణ ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నప్పటికీ, కొరటాల శివ చెప్పిన కాన్సెప్ట్ బాలయ్యకు బాగా నచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపుదిద్దే అవకాశం ఉన్నట్లు టాక్. అందుకే బాలకృష్ణ ఈ ప్రాజెక్ట్‌ను ఒప్పందం చేసుకున్నారట.  అన్ని పనులు సక్రమంగా జరిగితే, ఈ కొత్త కాంబో అనౌన్స్‌మెంట్‌ను దసరా కానుకగా ప్రకటించడానికి ప్లాన్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ వార్త మిడ్‌స్ట్రీమ్ నుంచి ఫ్యాన్స్ మధ్యకూ వైరల్ అయ్యింది. కొరటాల శివ–బాలకృష్ణ కొత్త కాంబోకి నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు . ఈ కాంబో కోసం  ఫుల్ జోష్‌తో ఎదురు చూస్తున్నారు. ఒక్కవేళ ఇదే నిజం అయితే మాత్రం 100 మిర్చిల మూవీ హిట్ కొట్టేసిన్నట్లే ఈ కొరటాల శివ అంటున్నారు నందమూరి ఫ్యాన్స్..!!



మరింత సమాచారం తెలుసుకోండి: