సినిమా ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో ఎదుగుతున్నా సరే, ఆయన ఎదుగుదలకి ఆటంకం కలిగించడానికి, వెనక్కి లాగడానికి లేదా తొక్కేయడానికి ప్రయత్నించే వాళ్లు ఎప్పుడూ చుట్టుపక్కలే ఉంటారు. నిజానికి ఇది సినిమా రంగంలోనే కాదు, ఏ రంగమైనా ఇదే పరిస్థితి. ఒక వ్యక్తి ప్రతిభతో, కష్టపడి ఎదుగుతున్నప్పుడు ఆ విజయాన్ని జీర్ణించుకోలేకపోయే వారు, అడ్డంకులు సృష్టించే వారు ఎప్పుడూ ఉంటారు. కానీ అలాంటి వారిని ఎదుర్కొని, పట్టుదలతో ముందుకు సాగేవాడే నిజమైన జీవితంలో సక్సెస్ అవుతాడు.అయితే కొన్నిసార్లు మనకి తెలిసినా, ఎదుటివాళ్లు మనల్ని తొక్కేస్తున్నారని తెలిసినా, మానవత్వం కోసం, మంచితనం కోసం వారికి సహాయం చేస్తూ ఉంటాం. అలాంటప్పుడు చాలా మంది మన మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోతారు. “ఇది గొప్ప హృదయమా..? లేదా మూర్ఖత్వం నా?” అని ప్రశ్నించే వాళ్లు కూడా ఉంటారు. ప్రస్తుతం అలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్‌లో ట్రెండ్ అవుతున్నాయి. ఈ చర్చల మధ్యలో మాస్ మహారాజా రవితేజ పేరు ప్రత్యేకంగా వినిపిస్తోంది.

రవితేజ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ఉన్న స్టైల్, ఆయనకు ఉన్న టాలెంట్, ఆయన అందించే ఎనర్జీ – ఇవన్నీ ఆయనను ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన స్థాయికి తీసుకెళ్లాయి. వరుస సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయి కలెక్షన్స్ సాధించకపోయినా, ఆయన క్రేజ్ మాత్రం ఇంచుమించు తగ్గడం లేదు. ఆయన సంపాదించుకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ డబ్బులు ఇచ్చి కొన్నది కాదు, ఆయన అసలైన టాలెంట్‌తో, ఆయన నటనతో, ఆయన హాస్య టైమింగ్‌తో వచ్చిందే. అందుకే రవితేజ ఫ్యాన్స్ ఎప్పుడూ గర్వంగా “మన హీరో డబ్బులిచ్చి చప్పట్లు కొట్టించుకునే వాడు కాదు, టాలెంట్‌తోనే చప్పట్లు కొట్టించుకునే వాడు” అని అంటుంటారు.

ఇప్పుడే సోషల్ మీడియాలో రవితేజ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారింది. రవితేజ సాధారణంగా ఇండస్ట్రీలోని ఇతర హీరోలకూ సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఎవరి సినిమా రిలీజ్ అయినా, వీలైనంతవరకు సపోర్ట్ చేసే వ్యక్తి. అలాంటి రవితేజ ఇప్పుడు తన “హీరో ఇమేజ్” పక్కన పెట్టి, విలన్ రోల్ చేయడానికి సిద్ధపడ్డాడట. అది మరెవరి సినిమాలోనో కాదు, తనకు ఎంతో ఇష్టమైన మెగాస్టార్ చిరంజీవి సినిమాలో.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా, నయనతార హీరోయిన్‌గా ఓ భారీ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో రవితేజ ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడట. ఇండస్ట్రీ టాక్ ప్రకారం ఈ పాత్ర సినిమా కథలో ఒక మేజర్ మలుపు తిప్పే కీలకమైన క్యారెక్టర్ అని తెలుస్తోంది. మొదట ఈ పాత్ర కోసం ఆది పినిశెట్టిని అప్రోచ్ చేసినా, ఆయన రిజెక్ట్ చేయడంతో ఆ ఆఫర్ రవితేజ దగ్గరకు వెళ్లిందట. చిరంజీవి పట్ల ఉన్న గౌరవం, అభిమానంతో రవితేజ వెంటనే అంగీకరించాడని టాక్.త్వరలోనే చిరంజీవి–రవితేజల మధ్య సీన్స్ చిత్రీకరణ జరగబోతున్నట్లు సమాచారం. ఈ వార్త బయటికొచ్చిన వెంటనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. “రవితేజ నిజంగా ఎంత మంచోడో చూడండి! హీరో ఇమేజ్ పక్కన పెట్టి, విలన్ రోల్ చేయడానికి సిద్ధమయ్యాడు. అది కూడా తన అభిమానించే మెగాస్టార్ కోసం!” అంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఈ వార్త చూసిన తర్వాత చాలామంది ఒకే మాట అంటున్నారు – “ఇదే నిజమైన పెద్ద మనసు. ఇదే నిజమైన ఆర్టిస్ట్ లక్షణం. హీరోగానో, విలన్‌గానో కాకుండా, మంచి పాత్రలో నటించడం కోసం ఓకే చెప్పే రవితేజ లాంటి నటుడే రియల్ హీరో” అని మాట్లాడుకుంటున్నారు..!!


మరింత సమాచారం తెలుసుకోండి: