గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాలకృష్ణ వర్సెస్ చిరంజీవి పేర్లు ఎలా మారుమ్రోగిపోతున్నాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా బాలయ్య అసెంబ్లీలో చేసిన కొన్ని వ్యాఖ్యలు మెగాస్టార్ అభిమానుల్లో పెద్ద దుమారం రేపాయి. చిరంజీవి ఫ్యాన్స్ ఆ వ్యాఖ్యలకు తీవ్రంగా స్పందిస్తూ సోషల్ మీడియాలో బహిరంగ నిరసనలు వ్యక్తం చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన అభిమానులను ఆపుతూ, అలాంటి విపరీత చర్యలకు పాల్పడవద్దు అని విజ్ఞప్తి చేశారు. ఆయన చెప్పిన మాట విని మెగా ఫ్యాన్స్ కొంతమేరకు వెనకడుగు వేసినా, బాలయ్య మాత్రం బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. దీంతో ఈ అంశం సోషల్ మీడియాలో మరింత హీట్ పుట్టిస్తోంది.


అయితే ఈ వివాదం అసలు ఎలా మొదలైంది..? ఎందుకు మొదలైంది..? అన్నది పక్కన పెడితే.. గతంలో కూడా చిరంజీవి – బాలయ్యల మధ్య జరిగిన కొన్ని మిస్ అండర్‌స్టాండింగ్స్ ఇప్పటికీ అభిమానులు రీకాల్ చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. నటించిన ప్రతి సినిమా హిట్ అవ్వదు, అలాగే తీసుకున్న ప్రతి సినిమా ఫ్లాప్ అవ్వాలన్నది కూడా కచ్చితమేమీ కాదు. ఒక సినిమా విజయవంతం కావడానికి కథ, కంటెంట్, దర్శకుడి నైపుణ్యం, ప్రేక్షకుల రుచులు, అలాగే హీరోకి ఉన్న క్రేజ్ అన్నీ కలిసిరావాలి. ఇప్పుడీ కాంట్రవర్సీ మధ్య పాత విషయాలు మళ్లీ వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇద్దరు స్టార్ హీరోలతో నటించిన హీరోయిన్‌ల రికార్డులు ఇప్పుడు మళ్లీ చర్చకు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఇవి చాలా ఇంట్రెస్టింగ్‌గా వైరల్ అవుతున్నాయి.



సిమ్రాన్ విషయానికొస్తే.. బాలయ్యతో ఆమె చేసిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ రేంజ్‌లో విజయం సాధించాయి. కానీ అదే సిమ్రాన్ చిరంజీవితో చేసిన డాడీ, మృగరాజు సినిమాలు మాత్రం పెద్దగా ఆడలేదు. ఫ్లాప్ లిస్ట్‌లో చేరిపోయాయి.సోనాలి బింద్రే విషయంలో పూర్తిగా రివర్స్ సీన్ జరిగింది. ఆమె చిరంజీవితో నటించిన ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాలు సాధించాయి. కానీ అదే సోనాలి బాలయ్యతో చేసిన పలనాటి బ్రహ్మనాయుడు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర వైఫల్యం ఎదుర్కొంది.



శ్రేయ విషయానికొస్తే, ఆమె చిరంజీవితో నటించిన ఠాగూర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. కానీ అదే శ్రేయ - బాలయ్యతో నటించిన చెన్నకేశవరెడ్డి, గౌతమీపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కొన్నివరకు పూర్తిగా డిజాస్టర్‌గా మారాయి.ఈ కాంబినేషన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ ట్రెండింగ్ అవుతుండటంతో కొంతమంది ఫ్యాన్స్ “హీరోయిన్స్‌ని ఈ కాంట్రవర్సీకి లింక్ చేయడం ఏమిటి?” అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. మరికొందరు మాత్రం ఈ రికార్డులు కూడా ఆసక్తికరంగానే ఉన్నాయని కామెంట్లు చేస్తున్నారు.



మొత్తం మీద బాలయ్యచిరంజీవి వార్ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుండగా, అనుకోకుండా హీరోయిన్స్ పేర్లు కూడా ఈ వివాదంలో లింక్ అవుతుండటం నెటిజన్స్‌కి కాస్త సర్ప్రైజ్‌గా..మ్రికొంతమందికి ఇబ్బందిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: