
ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రుక్మిణి వసంత్. "కాంతార చాప్టర్ వన్" సినిమాలో ఆమె నటన చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఆ సినిమాలో ఆమె చూపించిన పర్ఫార్మెన్స్ ఒక వేరే లెవెల్‌లో ఉందని అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ సినిమాకోసం ఆమె పడిన కష్టం ఒక్కో సీన్‌లో స్పష్టంగా కనిపించింది. ఫలితంగా, ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ లిస్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చేసింది రుక్మిణి. ఇక శ్రీలీల సంగతి ప్రత్యేకమే. వరుస సినిమాలతో బిజీగా ఉండే ఈ హీరోయిన్, కొన్నిసార్లు సినిమాలు బాగా ఆడకపోయినా, ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. "ఫ్లాప్ సినిమాలు వస్తే హీరోయిన్ల కెరీర్ దెబ్బతింటుంది" అనే మాటను ఆమె తప్పు చేసింది అనిపిస్తోంది. ఎందుకంటే, ప్రాజెక్ట్స్ పరంగా, క్రేజ్ పరంగా ఇప్పటికీ టాప్ రేంజ్‌లో కొనసాగుతూనే ఉంది.మరి ఈ ముగ్గురు బ్యూటీస్ మధ్య ఉన్న కామన్ పాయింట్ ఏమిటంటే – వీళ్లు ఏ డ్రెస్ వేసుకున్నా, ఏ లుక్‌లో ఉన్నా సూపర్‌గా సెట్ అయిపోతారు.
ట్రెడిషనల్ లుక్స్‌లోనూ, మోడ్రన్ లుక్స్‌లోనూ ఈ ముగ్గురు హీరోయిన్‌లు అద్భుతంగా కనిపిస్తారు. రష్మిక, శ్రీలీల, రుక్మిణి వసంత్ – ఎవరు ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నా పక్కా అద్భుతం, ఎవరు మోడ్రన్ స్టైల్‌లో కనిపించినా మరో లెవెల్. ఇదే విషయాన్ని సోషల్ మీడియా యూజర్లు కూడా గుర్తించారు. రీసెంట్‌గా "కాంతార చాప్టర్ వన్" సినిమా ద్వారా రుక్మిణి వసంత్ ఇచ్చిన ప్రూఫ్‌తో ఈ ట్రెండ్ మరింత బలపడింది. “మొత్తానికి ఈ ముగ్గురు కన్నడ బ్యూటీస్‌కి ఉన్న ప్రత్యేకతే వేరు” అని అభిమానులు చెబుతున్నారు. ఎందుకంటే, ఇతర హీరోయిన్స్‌లో కనిపించని ఆ ప్రత్యేకత, ఈ ముగ్గురిలో మాత్రం బాగా కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోనూ, సోషల్ మీడియాలోనూ ప్రధాన చర్చ ఇదే – రష్మిక, శ్రీలీల, రుక్మిణి వసంత్ – ఎవరు నిజమైన నెక్స్ట్ నంబర్ వన్ హీరోయిన్? అని మాట్లాడుకుంటున్నారు..!!