తరచు ఈ మధ్యకాలంలో సినీ సెలబ్రిటీల పైన దాడులు జరగడం వల్ల వార్తలలో నిలుస్తున్నారు. ముఖ్యంగా టాప్ సెలబ్రిటీలకు బాంబు బెదిరింపులు రావడం తరచు ఎక్కువగా వింటున్నాం. ఇప్పుడు తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసానికి బాంబు బెదిరింపులు వచ్చినట్లు వినిపిస్తున్నాయి, అలాగే బిజెపి రాష్ట్ర కార్యాలయం, హీరోయిన్ త్రిష ఇంటి తో సహా పలువురు ముఖ్యచోట్ల బాంబు బెదిరింపుల వార్తలు వినిపిస్తున్నాయి . దీంతో ఒక్కసారిగా చెన్నైలో భద్రతా పరిస్థితులు మరింత ఉధృతం చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఈ విషయం పై పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ బాంబు బెదిరింపులు నిన్నటి రోజున సాయంత్రం ప్రారంభమయ్యాయి. సీఎం స్టాలిన్, త్రిష, బిజెపి కార్యాలయానికి ఒకేసారి ఫోన్ కాల్స్ తో బాంబు బెదిరింపులు చేశారు. దీంతో వెంటనే చెన్నై పోలీసులు బాంబు డిటెక్షన్ స్వాడ్ ను  రంగంలోకి దింపగా ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పదమైన వస్తువులు లభించలేదంటూ తెలియజేస్తున్నారు. హీరోయిన్ త్రిష తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తోంది. చెన్నైలోని సెనోటాఫ్ రోడ్డు ప్రాంతంలో ఈమె నివసిస్తోంది.ఈ విషయం విన్న అభిమానులు ఆందోళన చెందుతున్నారు


అలాగే సీఎం స్టాలిన్ హౌస్ కూడా చిత్తరంజన్ రోడ్డు సమీపంలో ఉన్నది. అటు రాజకీయ, సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకొని ఈ బాంబు బెదిరింపులు చేస్తున్నట్లు కనిపిస్తోంది. మరి ఇలాంటి బెదిరింపులు వెనుక ఎవరు ఉన్నారనే విషయంపై తెలుసుకోవడానికి సైబర్ క్రైమ్ టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. గతంలో కూడా జులై 27న సీఎం స్టాలిన్ ఇంటికి ఇలాంటి బెదిరింపులు రాగా కొంతమంది ఆకతాయిలు చేశారని తెలిసింది.ఈ నేపథ్యంలోనే పోలీసులు భద్రతా చర్యల పైన మరింత బదోపేతం చేయడానికి సిద్ధమయ్యారు. ఇక ఇటీవల హీరో విజయ్ ఇంటికి కూడా బాంబు బెదిరింపులు అంటూ వినిపించాయి. మరి ఈ బెదిరింపులతో అక్కడి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనే విషయంపై చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: