
అయితే ఈ విషయంపై ఇప్పటివరకు రష్మిక గానీ, విజయ్ దేవరకొండ గానీ అధికారికంగా ఎలాంటి స్పందన ఇవ్వలేదు. అంతేకాదు, ఇరువురు కుటుంబాల నుంచి కూడా ఎలాంటి ఖండన లేదా ధృవీకరణ రాలేదు. దీంతో ఫ్యాన్స్ మధ్య ఈ వార్తలు నిజమేమో అనే నమ్మకం పెరుగుతోంది. “ఇది ఫేక్ అయితే ఇప్పటికి వాళ్లు రియాక్ట్ అయ్యేవారు, కానీ ఇంతవరకు ఎలాంటి రియాక్షన్ రాలేదు అంటే ఏదో నిజం ఉందేమో” అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.ఇక యూట్యూబ్ మరియు సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో మాత్రం ఈ వార్తలపై బాగా హల్‌చల్ నడుస్తోంది. పలు ఛానెల్స్ గతంలో రష్మిక మరియు విజయ్ కలిసి దిగిన పాత ఫోటోలను తీసుకుని “ఇవే వాళ్ల నిశ్చితార్థ ఫొటోలు” అంటూ వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలకు లైకులు, వ్యూస్ పెరిగిపోతున్నాయి. అయితే వాస్తవానికి ఇప్పటివరకు ఈ జంట నిశ్చితార్థానికి సంబంధించిన ఒక్క ఒరిజినల్ ఫొటో కూడా బయటకు రాలేదు.
ఫ్యాన్స్ మాత్రం ఈ జంట నిజంగానే నిశ్చితార్ధం చేసుకుని, అది ప్రైవేట్‌గా ఉంచారని నమ్ముతున్నారు. “వాళ్లు ఎప్పుడూ తమ వ్యక్తిగత విషయాలను పబ్లిక్‌గా బయట పెట్టరు. అందుకే ఇప్పటివరకు ఎలాంటి ఫొటోలు రాలేదు” అని అభిమానులు చెబుతున్నారు.ప్రస్తుతం రష్మిక – విజయ్ పాత ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో మళ్లీ రీట్రెండ్ అవుతున్నాయి. ఈ ఇద్దరూ కలిసి కనిపించే ప్రతి ఫ్రేమ్ ఫ్యాన్స్‌కి పండుగలా మారింది. "వీళ్ళిద్దరూ చూడముచ్చటగా ఉన్న జంట, స్క్రీన్ మీద కంటే రియల్ లైఫ్ లో ఇంకా క్యూట్ గా కనిపిస్తున్నారు" అంటూ కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఏదేమైనా, ఈ లవ్‌బర్డ్స్ నిశ్చితార్థ వార్తలు నిజమా కాదా అన్నది అధికారికంగా తెలియాలంటే కొంత సమయం పట్టేలా ఉంది. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలి — రష్మిక మందన, విజయ్ దేవరకొండ జంటకు అభిమానులలో ఉన్న క్రేజ్, వారి కెమిస్ట్రీ, పబ్లిక్‌లో కలిసే ప్రతి క్షణం సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతూనే ఉంది.ఫ్యాన్స్ మాత్రం ఒక్కటే అంటున్నారు — “వీళ్ళిద్దరూ ఎప్పుడు ఎంగేజ్ అయినా, ఎప్పుడు పెళ్లి చేసుకున్నా, మేమంతా బ్లెస్సింగ్స్ తో ఉంటాం!” అంటూ ట్రెండ్ చేస్తున్నారు..!!