టాలీవుడ్ మన్మథుడు, స్టార్ హీరో అక్కినేని నాగార్జునకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరు పదుల వయస్సులోనూ యంగ్ హీరోలకు పోటీనిస్తూ వరుస సినిమాలు చేస్తున్న ఆయన 100వ సినిమా ఎప్పుడు ఉంటుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. తాజాగా, ఆ ఎదురుచూపులకు తెరపడింది. నాగార్జున ప్రతిష్ఠాత్మక 100వ చిత్రం సైలెంట్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

ఈ ఏడాది 'కూలీ' సినిమాతో మంచి హిట్ అందుకున్న నాగార్జున, ఈసారి తమిళ దర్శకుడు కార్తీక్ డైరెక్షన్‌లో తన 100వ సినిమా చేయనున్నారు. ఇది యాక్షన్-కామెడీ ఎంటర్‌టైనర్గా రూపొందుతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని స్వయంగా నాగార్జునే తన మనం ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో ప్రేక్షకులను మరింత ఆకట్టుకునే విషయం ఏంటంటే... కింగ్ నాగార్జునకు జోడీగా ఏకంగా ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికీ ఇంతటి ఛార్మింగ్‌తో ముగ్గురు కథానాయికలతో రొమాన్స్ చేయబోతున్న నాగార్జునని చూసి, నెటిజన్లు "నిజంగా నాగ్ ఇప్పటికీ మన్మథుడే" అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన మరో ముఖ్యమైన అప్‌డేట్ ఏమిటంటే, ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారని తెలుస్తోంది. బ్లాక్‌బస్టర్ హిట్స్‌కు సంగీతం అందించిన దేవిశ్రీ, నాగ్ 100వ సినిమాకు ఎలాంటి మ్యూజిక్ అందించి హిట్ చేస్తారో చూడాలి. మొత్తానికి, 'నాగ్ 100' అనౌన్స్‌మెంట్‌తోనే అక్కినేని అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: