
2023 జూన్ 20న ఉపాసన, రామ్ చరణ్ దంపతులకు ఆడబిడ్డ జన్మించింది. ఆ చిన్నారి పేరు “క్లీన్ కారా” అని పెట్టి నామకరణం కూడా ఘనంగా నిర్వహించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఆ పాప ముఖాన్ని సోషల్ మీడియాలో ఒక్కసారైనా చూపించలేదు. ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణం ఏంటో తెలియక కొంతమంది సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ — “వీళ్లకి డబ్బు ఉందని హెడ్‌వెయిట్ చూపిస్తున్నారు”, “పాపను ఇంతకాలం దాచిపెట్టడం ఎందుకు?” అంటూ కామెంట్లు చేశారు. అయితే తాజాగా జరిగిన ఒక వేడుకలో ఉపాసన దీనిపై స్పష్టమైన సమాధానం ఇస్తూ — ఒక్క మాటతో అందరి నోర్లు మూయించింది ఉపాసన.
“ప్రపంచం చాలా వేగంగా మారిపోతోంది. నేడు ఏమి జరుగుతుందో, రేపు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. ఇది సెలబ్రిటీలు అయినా, సామాన్యులు అయినా ఒకే పరిస్థితి. కొన్ని సంఘటనలు, ముఖ్యంగా తల్లిదండ్రులుగా మమ్మల్ని బాగా భయపెట్టాయి. అందుకే మా పాపకు స్వేచ్ఛ ఇవ్వాలి అనుకుంటున్నాం. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్లేటప్పుడు కూడా పాప ముఖానికి మాస్క్ వేస్తాం. ఇది కొంతమందికి ‘ఓవర్’గా అనిపించవచ్చు కానీ మా దృష్టిలో ఇది చాలా అవసరం. మా పాప సేఫ్టీ మా చేతుల్లో ఉండాలి. తల్లిదండ్రులుగా మేము ఎప్పటికీ ఈ నిర్ణయాన్ని పాటిస్తూనే ఉంటాం. ఎవరు ట్రోల్ చేసినా, ఎవరు తప్పు అన్నా — మాకు తెలిసినంతవరకు క్లీన్ కారా సేఫ్టీనే మాకు ప్రాధాన్యం.” ఉపాసన మాటలు అందరిని అట్రాక్ట్ చేశాయి. ఆమె చెప్పిన ప్రతి లైన్‌లో ఒక తల్లిగా, ఒక బాధ్యతగల మహిళగా ఉన్న భావోద్వేగం స్పష్టంగా కనిపించింది.
కొంతమంది సోషల్ మీడియాలో కావాలనే విమర్శలు చేస్తూ ఉన్నా — మెగా ఫ్యాన్స్ మాత్రం ఉపాసనకు పూర్తి మద్దతు ఇస్తున్నారు. “ఉపాసన తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం. ప్రతి తల్లి కూడా తన పిల్లల భద్రత గురించి ఇదే విధంగా ఆలోచించాలి” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఉపాసన తన ఆలోచనలతో, తన ధైర్యంతో మళ్లీ ఒకసారి నిరూపించింది — స్టార్ హీరో భార్యగా కాకుండా, ఒక సాధారణ తల్లిగా కూడా ఆమె హృదయం ఎంత పెద్దదో..!!