టాలీవుడ్ హీరో నితిన్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులనే కాదు ,పాటలనే కాదు, కొన్ని సందర్భాలలో టైటిల్స్ ని కూడా తన సినిమాలకు పెట్టేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో నితిన్ నటించిన సినిమాలు అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేదు. అప్పుడెప్పుడో వచ్చిన భీష్మ సినిమా తప్ప మరే సినిమా హిట్ అందుకోలేదు. లై, చెక్, చల్ మోహన్ రంగా, రంగ్ దే , శ్రీనివాస కళ్యాణం, మాస్ట్రో , రాబిన్ హుడ్, మాచర్ల నియోజకవర్గం, తమ్ముడు వంటి చిత్రాలు చేసిన ఒక్క హిట్ కూడా దక్కలేదు.



దీంతో నితిన్ కెరియర్ ప్రస్తుత అయోమయంలో పడింది. ఇప్పుడు అర్జెంటుగా సక్సెస్ కావాలి కాబట్టి అందుకే మరొకసారి తన ఫేవరెట్ హీరో అయినా పవన్ కళ్యాణ్  సెంటిమెంట్ ను ఉపయోగించాలని ప్లాన్ చేస్తున్నారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజి (ఓజాస్ గంభీర) టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. తన తదుపరి చిత్రానికి "గంభీర" అనే టైటిల్ని ఫిక్స్ చేసేలా నితిన్ ఆలోచిస్తున్నారట. ఇటీవల ఓకే చేసిన యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమాకి నితిన్ ప్లాన్ చేసినట్లుగా టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


రానున్న సినిమాకి కథపరంగా కూడా గంభీర అనే టైటిల్ అయితే బాగుంటుందనే విధంగా మేకర్స్ తో సహా నితిన్ కూడా భావించారు. అలాగే పవన్ కళ్యాణ్  సెంటిమెంట్  విషయంలో కూడా గతంలో నితిన్ కి చాలా వర్క్ అవుట్ అయింది. అందుకే ఇప్పుడు మళ్లీ అదే బాటలో నడుస్తున్నారు నితిన్. త్వరలోనే ఇందుకు సంబంధించి మేకర్స్ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరి ఈ చిత్రంతో నైనా నితిన్ ఏ విధంగా సక్సెస్ అందుకుంటారో చూడాలి మరి. ఒకవేళ ఇది సక్సెస్ అయితే తన తదుపరి చిత్రాలలో కూడా ఇలానే ప్లాన్ చేసేలా చూస్తున్నారు నితిన్.

మరింత సమాచారం తెలుసుకోండి: