ఓ జీ ..ఓ జీ ..ఓ జీ అని సోషల్ మీడియాలో హడావుడి చేసిన  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు ఆ ఆనందంలోనే తేలుతున్నారు. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ నటించిన “ఓజి” సినిమా ఎట్టకేలకు థియేటర్లలో రిలీజ్ అయ్యి సూపర్ సూపర్ హిట్ కొట్టేసింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తే, ఇది పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే ఒక విపరీతమైన బ్లాక్‌బస్టర్ అని చెప్పక తప్పదు. ఇప్పటికే సినిమా థియేటర్లలో హౌస్‌ఫుల్ షోస్‌తో దూసుకుపోతూ ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు ఒక్కసారి కాదు, పదిసార్లు చూసినా మళ్ళీ చూడాలనిపించేలా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం మాత్రం సుజిత్ దర్శకత్వం. ఆయన తీసిన ప్రతి సీన్‌లో పవన్ కళ్యాణ్ స్టైల్, మాస్ యాక్షన్, ఎమోషన్ అన్నీ పర్ఫెక్ట్‌గా మిళితమయ్యాయి. అందుకే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ సక్సెస్ వేడుకలో ఇండస్ట్రీ అంతా మునిగిపోయిన సమయంలో..కాంతార చాప్టర్ 1 వచ్చింది. ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్టే. ఇప్పుడు మరో స్టార్ హీరో సినిమా సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది.


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న “డ్రాగన్” (వర్కింగ్ టైటిల్)  సినిమా గురించిన చర్చలు సోషల్ మీడియాలో జోరుగా వినిపిస్తున్నాయి. దానికి ప్రధాన కారణం — ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ ఎవరనే ప్రశ్న చుట్టూ తిరుగుతున్న వార్తలే. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ప్రతి అప్డేట్‌ను యూనిట్ చాలా సీక్రెట్‌గా ఉంచుతోంది. ఇప్పటివరకు అధికారికంగా ఒక్క అప్‌డేట్‌ కూడా రాలేదు. అయితే కొన్ని సినీ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్‌గా నటిస్తున్న రుక్మిణీ వస్మత్ ఇప్పటికే షూటింగ్‌లో పాల్గొంటోంది. ఆమె నటన, రూపం గురించి సోషల్ మీడియాలో ఎన్నో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.



ఇప్పటివరకు అందరికీ సస్పెన్స్‌గా ఉన్న సెకండ్ హీరోయిన్ పేరు ఇప్పుడు బయటకు వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, అందాల ముద్దుగుమ్మ, బాలీవుడ్ బ్యూటీ మృణాల్  ఠాకూర్ ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఆమె ఇటీవలి షెడ్యూల్‌లో కూడా పాల్గొన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. తాజా షెడ్యూల్‌లో ఎన్టీఆర్ పాల్గొనలేదట. ఆయన స్వల్ప అనారోగ్య కారణంగా ఈ షెడ్యూల్‌ మిస్ అయినప్పటికీ, మృణాల్ ఠాకూర్‌పై చిత్రీకరించాల్సిన సన్నివేశాలను డైరెక్టర్ పూర్తిచేసేశారట. ఈ షాట్స్ చాలా క్లాసీగా, అలాగే ఫన్నీగా కూడా తెరకెక్కించారని సమాచారం.



అంతేకాదు, రుక్మిణి వసంత్ మరియు మృణాల్ ఠాకూర్ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది. ఈ సీన్స్‌ సెట్‌పై చూసిన యూనిట్ సభ్యులే — “డైరెక్టర్ చాలా రియలిస్టిక్‌గా, హ్యూమర్ టచ్‌తో తెరకెక్కించాడు” అని ప్రశంసించారట. ఈ వార్త బయటకు రావడంతో సోషల్ మీడియాలో మృణాల్ ఠాకూర్ పేరు హ్యాష్‌ట్యాగ్‌లలో ట్రెండ్ అవుతోంది. “ఎన్టీఆర్ లాంటి మాస్ హీరో పక్కన ఆమె కనిపిస్తే కెరీర్ సెట్ అయిపోయినట్టే” అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమాతో మరో సెన్సేషనల్ హిట్ ఇవ్వబోతున్నాడని ఫ్యాన్స్ నమ్మకంగా చెబుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ ప్రాజెక్ట్‌పై ఉన్న అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పుడు మృణాల్ ఠాకూర్ ఎంట్రీతో ఆ ఎక్సైట్మెంట్ ఇంకాస్త పెరిగింది అంటున్నారు సినీ లవర్స్..!!

మరింత సమాచారం తెలుసుకోండి: