కొంతమంది సినీ సెలబ్రిటీలు ఏ సమయంలో ఎలా ఉంటారో ఎప్పుడు ఎలా మాట్లాడుతారో ఎవరి బాగోతాలు బయటపెడతారో చెప్పడం చాలా కష్టం. అయితే అలాంటి ఒక విషయాన్ని ఓ డైరెక్టర్ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయటపెట్టారు. ఇది కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. నా డబ్బు తీసుకొని రాంచరణ్ ఇచ్చారంటూ డబ్బా కొట్టుకున్నారు అంటూ ఆ డైరెక్టర్ మాట్లాడిన మాటలు మెగా ఫ్యాన్స్ కి కోపం తెప్పిస్తున్నాయి. మరి ఆ డైరెక్టర్ ఎవరు.. ఎందుకు అలాంటి మాటలు మాట్లాడారు అనేది ఇప్పుడు చూద్దాం.. ఎంతోమంది హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసి స్టార్ దర్శకుడిగా ఒకప్పుడు ఎంతో మంచి గుర్తింపు సంపాదించిన డైరెక్టర్ తేజ అంటే తెలియని వారు ఉండరు. ఈయన డైరెక్షన్లో ఎంతోమంది హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అవ్వడమే కాదు స్టార్లు కూడా అయ్యారు. అలా దిగ్గజ డైరెక్టర్ గా ఒకప్పుడు గుర్తింపు తెచ్చుకున్న తేజ చివరిగా అహింస అనే సినిమాతో  మన ముందుకు వచ్చారు. 

కానీ ఈ సినిమా అంతా హిట్ అయితే కాలేదు. అయితే సినిమాల విషయం కాస్త పక్కన పెడితే దర్శకుడు తేజయూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఆయన ఆ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..నేను డైరెక్షన్ చేసిన నిజం సినిమాలో మహేష్ బాబు తండ్రి పాత్రలో మొదట మురళీమోహన్ ని ఎంపిక చేసుకున్నాను.కానీ మురళీమోహన్ మహేష్ బాబు తండ్రి పాత్రలో సెట్ అవ్వకపోవడంతో ఆయనని తొలగించి రంగనాథ్ ని పెట్టుకున్నాము.అయితే అప్పటికే మురళీమోహన్ కి ఫిక్స్ చేసుకున్న రెమ్యూనరేషన్ ని కూడా ఇచ్చి పంపించేసాం.కానీ ఆ సమయంలో మురళీమోహన్ వివాదం సృష్టించారు.

నన్ను సినిమా కోసం తీసుకొని నా డేట్స్ అన్ని సినిమా కోసం ఫిక్స్ చేసి నేను వేరే సినిమాలు వదులుకున్నాను.దీనికోసం నాకు పరిహారం చెల్లించాల్సిందే అంటూ మాట్లాడారు.దాంతో చేసేదేమీ లేక పరిహారం చెల్లించడానికి ఒప్పుకున్నాం. కానీ పరిహారం ఆయనకి కాకుండా ఓ గుడికి విరాళంగా ఇవ్వాలని అన్నారు. దాంతో ఆ గుడికి విరాళం ఇచ్చేసాను. కానీ ఆ సమయంలో నా డబ్బులు నేను విరాళంగా ఇస్తే అది రామ్ చరణ్ ఇచ్చాడు అని డబ్బా కొట్టించుకున్నారు. ఇక ఆ సమయంలో నేను కూడా దాన్ని అంతగా పట్టించుకోలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు డైరెక్టర్ తేజ.అయితే తేజ మాటలపై మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ ఎందుకు అలా సెల్ఫ్ డబ్బా కొట్టించుకుంటారు.. సెల్ఫ్ డబ్బా కొట్టించుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: